ఓరీ దేవుడో.. 12రోజుల పాటు నిలిచిపోయిన ట్రాఫిక్‌..! వాహనాల్లోనే తిండి, నిద్ర.. ఎక్కడంటే..

|

Sep 05, 2024 | 11:15 AM

ఈ ట్రాఫిక్ జామ్‌ను క్లీయర్‌ చేయటానికి స్థానిక పరిపాలన యంత్రాంగం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.  హైవే నుండి ట్రక్కులను తొలగించాలని నిర్ణయించింది. ట్రక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా హైవే నుండి తొలగించారు. హైవే రెండు లేన్లు ఓపెన్‌ చేశారు. ఈ విధంగా 12 రోజుల తర్వాత 26 ఆగస్టు 2010న ఈ ట్రాఫిక్ జామ్ ముగిసింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఓరీ దేవుడో.. 12రోజుల పాటు నిలిచిపోయిన ట్రాఫిక్‌..! వాహనాల్లోనే తిండి, నిద్ర.. ఎక్కడంటే..
Worlds Longest Traffic Jam
Follow us on

ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవడాన్ని ఎవరూ ఇష్టపడరు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో ప్రజల పరిస్థితి అధ్వానంగా మారుతుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సంఘటన ఒకటి జరిగింది. ఇది ఒకటి, రెండు గంటల పాటు కాదు.. ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్‌జామ్‌ కొనసాగింది. రోజుల తరబడి వాహనదారులు, ప్రయాణికులు రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. చివరకు ఆ రోడ్డుపై నిత్యవసరాల కోసం దుకాణాలు కూడా వెలిశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్రాఫిక్ జామ్ సమస్య అనేది..అన్ని పెద్ద నగరాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఢిల్లీలోని డిఎన్‌డి ఫ్లైఓవర్ నుండి ముంబై వర్షాల వరకు ప్రజలు చాలా గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గురించి మీకు తెలుసా? ఈ జామ్ చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకుంది.14 సంవత్సరాల క్రితం బీజింగ్-టిబెట్ హైవేపై 100 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. ఈ జామ్ 12 రోజులైన క్లియర్ కాలేదు. ఈ సంఘటన ఆగస్టు 14, 2010 నాటిది. చైనా జాతీయ రహదారి 110పై జామ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ 100 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్ ఎందుకు ఏర్పడిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు? వాస్తవానికి, బీజింగ్-టిబెట్ హైవేపై పెద్ద సంఖ్యలో బొగ్గుతో కూడిన ట్రక్కులు ఆగివున్నాయి. అందులో నిర్మాణ సామాగ్రి కూడా ఉంది. అంతా మంగోలియా నుంచి బీజింగ్‌కు వెళుతోంది. అటువంటి పరిస్థితిలో ట్రక్కులకు మార్గం కల్పించడానికి, ఎక్స్‌ప్రెస్‌వేలోని అన్ని వాహనాలను సింగిల్ లేన్‌లో నడపాలని ఆదేశించారు. ఈ సమయంలో హైవేపై నుంచి కిందకు వెళ్లే వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో హైవేపై 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

12 రోజుల పాటు ఈ ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న ప్రజల జీవితం నరకం కంటే దారుణంగా మారింది. తిండి, తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడ్డారు. రాత్రైతే వారి వారి కార్లలోనే పడుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సుదీర్ఘ జామ్ కారణంగా, హైవేపై స్నాక్స్, కూల్‌డ్రింక్‌, నూడుల్స్, తాగు నీరు విక్రయించే కొందరు దుకాణాలు కూడా తెరిచారు. కానీ, ఇక్కడి వస్తువుల ధర 10 రెట్లు ఎక్కువగా సెల్‌ చేశారు. అయినప్పటికీ ప్రజలు వాటిని కొనుగోలు చేయవలసి వచ్చింది.

ఈ వీడియోపై క్లిక్ చేసి చూడండి…

ఈ ట్రాఫిక్ జామ్‌ను క్లీయర్‌ చేయటానికి స్థానిక పరిపాలన యంత్రాంగం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.  హైవే నుండి ట్రక్కులను తొలగించాలని నిర్ణయించింది. ట్రక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా హైవే నుండి తొలగించారు. హైవే రెండు లేన్లు ఓపెన్‌ చేశారు. ఈ విధంగా 12 రోజుల తర్వాత 26 ఆగస్టు 2010న ఈ ట్రాఫిక్ జామ్ ముగిసింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..