Crazy Video: బంగారు వడాపావ్‌.. కావాలా నాయనా? రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

| Edited By: Anil kumar poka

Sep 04, 2021 | 8:31 PM

Golden Vadapav: వడాపావ్‌.. చాలామంది ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన చిరుతిండి. ముఖ్యంగా వడాపావ్ అంటేనే ఠక్కున గుర్తుకొచ్చే నగరం ముంబై..

Crazy Video: బంగారు వడాపావ్‌.. కావాలా నాయనా? రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Vadapav
Follow us on

వడాపావ్‌.. చాలామంది ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన చిరుతిండి. ముఖ్యంగా వడాపావ్ అంటేనే ఠక్కున గుర్తుకొచ్చే నగరం ముంబై. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో చాలామంది వడాపావ్ వ్యాపారులుంటారు. ఇది తిని బ్రతికే లక్షల మంది పేదలూ ఉంటారు. అయితే, ఇప్పుడు దుబాయ్‌లో చేసిన ఓ గోల్డెన్‌ వడాపావ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అట. గోల్డెన్‌ వడాపావా.? ఆశ్చర్యపోకండి.. దాని ఖరీదు తెలిస్తే షాక్‌ అవుతారు.!

డబ్బుంటే చాలు స్వర్గ సుఖాలు అనుభవించే భూతల స్వర్గం దుబాయ్‌. అటువంటి దుబాయ్‌ గోల్డ్ బిర్యానీ, గోల్డెన్ బర్గర్లు అందించిన తరువాత ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 22 క్యారెట్ల బంగారు వడాపావ్‌ని పరిచయం చేసింది. కరమాలో ఉన్న భారతీయ స్లయిడర్‌లకు సేవలు అందించడంలో ప్రసిద్ధి చెందిన ఓ పావో అనే సంస్థ కాస్ట్లీ పావ్‌ని ప్రవేశపెట్టింది. దీని ధర 99 దిర్హామ్ అంటే మన కరెన్సీలో సుమారు రూ. 2 వేలు అన్నమాట.

మరి ఇంత కాస్ట్లీ వెరైటీ వడాపావ్‌ను సాధారణంగా ప్లేట్‌లో పెట్టేసి ఇచ్చేస్తే వాల్యూ ఏముంటుంది? అందుకే ప్రజంటేషన్‌లో ఏమాత్రం తీసిపోకుండా 22 క్యారెట్ల బంగారం వడాపావ్ రేంజ్‌‌లోనే ప్రజంటేషన్ కూడా ఉంది. ఈ గోల్డెన్ వడాపావ్‌ని చిన్న చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. ఈ వడాపావ్‌తో పాటు స్వీట్ పొటాటో ఫ్రైస్, పుదీనా లేమనేడ్‌ని కూడా ఇస్తారు. ఈ వడాపావ్ మొత్తం ఛీజ్‌తో ఫిల్ చేస్తారు. ఫ్రెంచ్ నుండి ఇంపోర్ట్ చేసిన 22 క్యారెట్ గోల్డ్ లీవ్స్‌తో ఎంతో అద్భుతంగా దీనిని తయారు చేసి భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..