
అవును.. పురుగే కదా అని తీసిపారేయ్యకండి. ఎందుకంటే..? కొన్ని పురుగులు కూడా మనం ఊహించనంత ఖరీదైనవిగా ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ కీటకం. ఈ పురుగు ధర వింటే మీరు నోరెళ్లబెడతారు. అవును, దీనీ ధర ఏకంగా లక్షల్లో ఉంటుంది. ఈ ఖరీదైన కీటకం పేరు. స్టాగ్ బీటిల్…ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. ఇది కేవలం 2 నుండి 3 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. జపాన్‌కు చెందిన ఓ పెంపకందారుడు చెత్తలో ఉన్న ఈ పురుగును 65 లక్షలకు విక్రయించాడు. ఇప్పుడు కోట్లకు పైగా పలుకుతోంది. ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు కూడా కోట్లకు కోట్లు వెచ్చించడం విశేషం. స్టాగ్ బీటిల్స్ లుకానిడే కుటుంబానికి చెందినవి, ఇందులో దాదాపు 1,200 రకాల కీటకాలు ఉన్నాయి.
వెచ్చని, తేలికపాటి వాతావరణం ఉన్న ప్రాంతాలలో స్టాగ్ బీటిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ కనుమల హిమాలయ ప్రాంతంలోని అడవులలో స్టాగ్ బీటిల్స్ కనిపిస్తాయి. ఈ కీటకాలు ఎక్కువగా పాత చెట్లు లేదా కలప కుప్పలలో కనిపిస్తాయి. అవి ఎందుకు అంత ఖరీదైనవి అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఎందుకంటే.. ఈ కీటకం అరుదైన కీటకం, అనేక మందులలో ఉపయోగించబడుతుంది. చాలా మంది దీనిని అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో ఉంచుకోవడం వల్ల రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారని నమ్ముతారు.
చాలా స్టాగ్ బీటిల్స్ కొన్ని నెలలు మాత్రమే జీవిస్తాయి. వాటి జీవితకాలంలో సగానికి పైగా భూగర్భంలో గడుపుతాయి. అవి 3 నుండి 7 సంవత్సరాల వరకు ఎక్కడైనా గడపవచ్చు, అయితే ఇది సమయం, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. స్టాగ్ బీటిల్స్ కుళ్ళిపోతున్న కలపను తింటాయి, అక్కడే వాటి లార్వా ఆహారం తీసుకుంటాయి. వయోజన స్టాగ్ బీటిల్స్ పండ్ల రసాలు, నీరు, చెట్ల రసం మీద నివసిస్తాయి. అవి వాటి లార్వా అభివృద్ధి సమయంలో ఏర్పడిన కొవ్వు నిల్వలపై ఆధారపడతాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..