Work from wedding Viral Video: ఇళ్లల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా.. హడావుడి ఎంతలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే వివాహ వేడుక అయితే.. ఇంకా ఎక్కువ సందడి నెలకొంటుంది. ఇలాంటి సందడి నెలకొన్న ఓ ఇంట్లో.. వరుడు పెళ్లి మండపంపై ల్యాప్‌టాప్ పట్టుకోని వర్క్ చేస్తున్నాడు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కరోనా ప్రారంభం నాటినుంచి చాలామంది ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం చాలామంది జీవితాల్లో భాగంగా మారింది. ఇంట్లో పనులతోపాటు ఆఫీస్ పనులు కూడా సర్వసధారణంగా మారింది. ఈ క్రమంలో వర్క్ ఫ్రం వెడ్డింగ్ అనేలా.. ఓ ఉద్యోగి.. ఏకంగా పెండ్లి మంటపంపైనే ల్యాప్‌టాప్‌తో కూర్చున్నాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే.. ఈ వీడియోను చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు.
ఈ వీడియో ఓ వైపు పెళ్లి తంతు జరుగుతుంటుంది.. మరోవైపు వరుడు ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతుంటాడు. ఇది చూసిన వధువు సోఫాలో కూర్చొని నవ్వుతుంటుంది. అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వరుడికి పెళ్లి పీటలపై కూడా వర్క్ తప్పడం లేదు.. ఇదేం ఖర్మరా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరుడు తన పెళ్లిని కూడా సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడంటూ పేర్కొంటున్నారు.
Also Read: