VIRAL VIDEO : నది దాటుతున్న ట్రక్.. ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

VIRAL VIDEO : రష్యాలో ఓ ట్రక్ నదిపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో వాహనంతో పాటు డ్రైవర్ నీటిలో పడిపోయాడు.

VIRAL VIDEO : నది దాటుతున్న ట్రక్.. ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
Russia Bridge
Follow us
uppula Raju

|

Updated on: Jul 24, 2021 | 3:31 PM

VIRAL VIDEO : రష్యాలో ఓ ట్రక్ నదిపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో వాహనంతో పాటు డ్రైవర్ నీటిలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ట్రక్ డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. తూర్పు రష్యాలోని ఓ నదిలో వరదలు సంభవించాయి. ఈ సమయంలో నది నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో డ్రైవర్ ఈ వంతెనను దాటాలని ప్రయత్నించాడు. ట్రక్కును వంతెనపైకి ఎక్కించి ముందుకు కదిలాడు. కానీ వంతెన మధ్యలోకి రాగానే ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. దీంతో డ్రైవర్‌తో పాటు వాహనం కూడా నదిలో పడిపోయింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

విషయమేమిటంటే ఈ వంతెన చెక్కతో తయారు చేశారని తేలింది. మునుపటి వరదలలో కాంక్రీట్ వంతెన కొట్టుకుపోగా ప్రస్తుతం ఈ వంతెనను తయారు చేశారు. అయితే ఇటీవల వరదలు సంభవించడంతో ఈ వంతెన దాటాలంటే స్థానికులు భయపడేవారు. వీడియోలో ట్రక్ వంతెనపైకి ఎక్కి ముందుకు కదులుతున్నప్పుడు వంతెన క్రిందికి వంగిపోతున్నట్లు చూడవచ్చు. ట్రక్ వంతెన మధ్యలోకి చేరుకోవడంతో విరిగింది. ఈ సంఘటన రాజధాని మాస్కోకు తూర్పున 3700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరియం గ్రామంలో జరిగింది.

ఈ ప్రమాదకరమైన సంఘటనలో డ్రైవర్ బతికిపోయాడు. కానీ అతని ట్రక్ మునిగిపోయింది. ఈ సంఘటన తరువాత ఉరాయిం గ్రామస్థులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వారికి ఇప్పుడు నదిని దాటడానికి వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితిలో వారు నదిని దాటడానికి మరొక వంతెనను నిర్మించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉరేయం వంతెన మాత్రమే కాకుండా అనేక వంతెనలు దెబ్బతిన్నాయి.

Black Cobra: సరుకులు తీసేందుకు ప్రిజ్ డోర్ తీశారు.. బుసలు కొడుతూ దూసుకొచ్చిన నల్లత్రాచు

Delta Variant: రెండు డోసుల టీకా తీసుకున్నా కరోనా ఆగట్లేదు.. కారణాలేమిటి? నిపుణులు ఏం చెబుతున్నారు?

KTR Birthday: హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా!.. రేర్ పొటోతో కేటీఆర్‌కు కవిత జన్మదిన శుభాకాంక్షలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!