సోషల్ మీడియాలో నిత్యం వైలర్ అయ్యే వీడియోల్లో మ్యూజిక్, సాంగ్స్‌కి సంబంధించినవి కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఇక ఆ వీడియోలలో కొన్ని మనల్ని ఎంతగానో ఆకర్షించేవి కాగా, మరికొన్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించే పేరడీ సాంగ్స్. అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఏ పాటకూ లేదా మ్యూజిక్‌కి పేరడి కానే కాదు. కానీ దాన్ని చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వుకుంటారు లేదా ‘ఏం స్వరంరా బాబు’ అని నోరెళ్లబెట్టేస్తున్నారు. అలాగే ఈ వీడియోపై ఎంతో హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు.
వీడియోలో ఓ యువతి తన మధురాతి మధురమైన స్వరంతో పాడుతోంది. నిజానికి అది పాట కాదు, మ్యూజిక్ కాదు.. దానికి నిర్వచనం పెట్టడం కూడా సాధ్యం కాదేమో.. వినడానికి చాక్లెట్ పోగోట్టుకున్న పిల్లవాడు ఏడుస్తున్నట్లు ఉంది ఆమె సింగింగ్ పెర్ఫామెన్స్. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆమెను వారించేందుకు తన పక్కనే ఉన్న ఓ వ్యక్తి ప్రయత్నించినా ఆమె ఆగలేదు. పాడుతూనే ఉంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో naturelife_ok అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయింది.
కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఆమె స్వరం నాకు చాలా నచ్చింద’ని రాసుకొచ్చాడు. ఇంకో నెటిజన్ అయితే ‘ఇది పాట కానే కాదు, ఆకలి కేకలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఇతరులు ‘ఆమెను ఎక్కడైనా వదిలేసి రండి’, ‘ఆమెలో టాలెంట్ చాలా సూపర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకి ఇప్పటివరకు 31 వేలకు పైగా లైకులు, 24 లక్షలకు మించి వీక్షణలు వచ్చాయి.
మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..