Watch Viral Video: ఏంటి బ్రో ఇది..! ఢిల్లీ మెట్రోలో మహిళల యుద్ధం.. ఆయుధాలు చూస్తే అవాక్కే..!

|

Dec 06, 2023 | 1:24 PM

ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ, ఆ మహిళలిద్దరూ అది మెట్రో అనిగానీ, మనం నలుగురిలో ప్రయాణిస్తున్నామనే ఆలోచనగాని వారిలో ఏమాత్రం కనిపించలేదు. ముందుగా ఓ మహిళ ఎదుటి మహిళపై బాటిల్‌తో నీళ్లు చల్లేందుకు చూసింది. దానికి ప్రతిదాడిగా ఎదుటి మహిళ తన చెప్పులు తీసి దాడికి దిగింది. ఇదంతా వీడియో తీసిన కొందరు మెట్రో ప్రయాణికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Watch Viral Video: ఏంటి బ్రో ఇది..! ఢిల్లీ మెట్రోలో మహిళల యుద్ధం.. ఆయుధాలు చూస్తే అవాక్కే..!
Delhi Metro Fight
Follow us on

ఢిల్లీ మెట్రో వైరల్ వీడియో: గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. లేదంటే గతంలో ప్రతి రోజూ ఏదో ఒక వింత, విచిత్రమైన సంఘటనతో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తుండేది..ఇప్పుడు తాజాగా మరోమారు ఢిల్లీ మెట్రో ఇంటర్‌నెట్‌లో చేరింది. ఈ సారి మరో అస్తవ్యస్తమైన సంఘటనతో తెరమీదకు వచ్చింది. ఢిల్లీ మెట్రోలో జరిగిన ఈ కొత్త సంఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈసారి ఇద్దరు మహిళలు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఒకరు చేతిలో చెప్పులు పట్టుకుని, మరొకరు వాటర్‌ బాటిల్ తీసుకుని ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఒకరినొకరు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుకున్నారు. మరికొందరు మహిళలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.. రద్దీగా ఉండే మెట్రోలో ఇద్దరు మహిళా ప్రయాణికులు గొడవపడ్డారు. పరస్పరం వాదనకు దిగడంతో మిగిలి వారతంతా ఏమీ అర్థం కాని స్థితిలో చూస్తుండి పోయారు. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ, ఆ మహిళలిద్దరూ అది మెట్రో అనిగానీ, మనం నలుగురిలో ప్రయాణిస్తున్నామనే ఆలోచనగాని వారిలో ఏమాత్రం కనిపించలేదు. ముందుగా ఓ మహిళ ఎదుటి మహిళపై బాటిల్‌తో నీళ్లు చల్లేందుకు చూసింది. దానికి ప్రతిదాడిగా ఎదుటి మహిళ తన చెప్పులు తీసి దాడికి దిగింది. ఇదంతా వీడియో తీసిన కొందరు మెట్రో ప్రయాణికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి


ఈ వీడియోను సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘దేశీ_మోజిటో’ హ్యాండిల్ షేర్ చేసింది. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది. చాలా మంది దీనిని ‘రెగ్యులర్ మెట్రో ఎంటర్‌టైన్‌మెంట్’ అని పిలుస్తున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్లు నిజంగానే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..