AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: 87వయస్సులోనూ ఎయిర్ హోస్టెస్ గా.. చిరునవ్వులు చిందిస్తూ.. చలాకీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ

87 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు. ఇంట్లో ఉంటూ.. మనమళ్లు, మనమరాళ్లతో టైమ్ పాస్ చేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ బామ్మ మాత్రం ఆ వయసులోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. సాధారణంగా యువతులు, చిన్న వయసు మహిళలు నిర్వహించే..

Trending: 87వయస్సులోనూ ఎయిర్ హోస్టెస్ గా.. చిరునవ్వులు చిందిస్తూ.. చలాకీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ
American Air Hostess
Ganesh Mudavath
|

Updated on: Jul 02, 2022 | 7:42 PM

Share

87 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు. ఇంట్లో ఉంటూ.. మనమళ్లు, మనమరాళ్లతో టైమ్ పాస్ చేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ బామ్మ మాత్రం ఆ వయసులోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. సాధారణంగా యువతులు, చిన్న వయసు మహిళలు నిర్వహించే.. ఎయిర్ హోస్టెస్ (Air Hostess) బాధ్యతలను ఎలాంటి శ్రమ లేకుండా చేసేస్తోంది. అంతే కాదు ఆమె మాటతీరు చూసి అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా అతిపెద్ద వయస్సు కలిగిన ఎయిర్ హోస్టెస్ గా గిన్నిస్ రికార్డూ కొట్టేసింది. రిటైర్ అవ్వాల్సిన వయసులోనూ చలాకీగా పని చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటోంది. అమెరికాకు (America) చెందిన బెట్టె నాష్‌ అనే పెద్దావిడ వయసు 86 ఏళ్లు. ఆమె 1957లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అలా ఈ ఏడాదితో కలిపి ఆమె 65 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్నారు. అమెరికాలో పైలట్లు 65ఏళ్లకే రిటైర్‌ అవుతారు.. కానీ కమర్షియల్‌ అటెండెంట్లకు సర్వీసు పరిమితి నిబంధన ఉండదు. దీంతో బెట్టె నాష్ 86 ఏళ్ల వయసులోనూ ఎయిర్ హోస్టెస్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలైన ఫ్లైట్‌ అటెండెంట్‌గా ఆమె గిన్నిస్ రికార్డ్ సైతం కొట్టేసింది.

ఒకే సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసిన అత్యంత తక్కువ మందిలో బెట్టె నాష్‌ ఒకరు. ఈ 87 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ ఎక్కువగా కొలంబయా – బాస్టన్ విమానంలో సేవలందిస్తుంటారు. కొలంబియా -బాస్టన్‌ విమానంలో తరచూ ప్రయాణించే వారికి నాష్‌ సుపరిచితమే. చిరాకు పడకుండా అందర్నీ చిరునవ్వుతో పలకరించడంతో ఆమెను అందరూ ఇష్టపడుతుంటారు. కాగా.. బెట్టె నాష్ తన కెరీర్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ జలఫిరంగుల సెల్యూట్‌తో సత్కరించింది. ఈ ఏడాదికి ఆమె 65 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఆమెను మరోసారి సత్కరించాలని విమానయాన సంస్థ ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.