టాలెంట్ అనేది ఒక్కరికే సొంత కాదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రకమైన టాలెంట్ దాగి ఉంటుంది. అవసరమైన పరిస్థితుల్లో అది బయటకువస్తుంది. సింగింగ్, డ్యాన్సింగ్, ఇలా ఏ విషయం గురించి మాట్లాడుకున్నా ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వినూత్నంగా చేయడం, అనుకరించడం వంటివెన్నో నిత్యం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇలాంటి వీడియోలలో పాటలు పాడే వీడియోలు ఎక్కువ పాపులర్ అవుతుంటాయి. కొందరిలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వచ్చాక వారు ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోతారు. తాజాగా ఓ పెద్దావిడ పాట పాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆమె పాటను విన్న వారందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఆమె గొంతు అచ్చం లతా మంగేష్కర్ గొంతులా ఉందని ఆశ్చర్యపోతున్నారు.
#आह.?
ఇవి కూడా చదవండిआदमी मुसाफिर है…!!#HeartTouching pic.twitter.com/VmYk68qUBz
— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) July 6, 2022
వీడియోలో ఒక వృద్ధ మహిళ ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ పాడిన పాట ‘ఆద్మీ ముసాఫిర్ హై’ పాట పాడుతుంది. అక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఆమె పాటను ఎంతో వినసొంపుగా వింటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ అందమైన వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 6 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ఈ వీడియో చూసేయండి మరి..