Watch: మహిళ సర్పంచ్ ఇంగ్లీష్ స్పీచ్.. ఆశ్చర్యపోయిన ఐఏఎస్ ఆఫీసర్.. వీడియో చూస్తే అవాక్కే..!

|

Sep 20, 2024 | 5:44 PM

వీడియో చూసిన నెటిజన్లు సైతం మహిళ సర్పంచ్‌ ప్రతిభను ప్రశంసించారు. ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి కలెక్టర్ చిరునవ్వు నవ్వి.. చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయింది.. అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీనా దాబీ

Watch: మహిళ సర్పంచ్ ఇంగ్లీష్ స్పీచ్.. ఆశ్చర్యపోయిన ఐఏఎస్ ఆఫీసర్.. వీడియో చూస్తే అవాక్కే..!
Ias Tina Dabi
Follow us on

ఆమె ఒక గ్రామ సర్పంచ్‌ మాత్రమే..! అంటే తక్కువ చేసిన చెప్పటం కాదుగానీ,…గ్రామ సర్పంచ్‌ అనగానే.. సాధారణంగానే గ్రామస్థాయి కాబట్టి.. పెద్దగా ఇంగ్లీష్‌ మాట్లాడరు అని అనుకుంటారు.. కానీ, గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కలెక్టర్ టీనాదాబి హాజరయ్యారు.. ఈ నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ వారి స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి కలెక్టర్‌కి స్వాగతం పలికింది. అనంతరం ఆ వేదికపై నీటి సంరక్షణపై ప్రసంగించింది. అయితే ఆ సర్పంచ్ మాట్లాడింది స్థానిక బాషాలో మాత్రం కాదండోయ్‌.. సదరు గ్రామ సర్పంచ్‌ ఇంగ్లీష్‌లో స్పీచ్‌ ఇరగదీసింది. ఆమె ఇంగ్లీష్ భాషా నైపుణ్యం చూసిన ఐఏఎస్‌ అధికారి టీనా సైతం ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజస్థాన్ బార్మర్‌లోని ఓ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కలెక్టర్ టీనాదాబి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి కలెక్టర్‌కి ఆంగ్లంలో స్వాగతం పలికింది. అనంతరం ఆ వేదికపై నీటి సంరక్షణపై ప్రసంగించింది. అయితే ఆ సర్పంచ్ ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి టీనా సైతం ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయారు. మహిళా సర్పంచ్ అనర్గళమైన ఇంగ్లీష్ ప్రసంగం విని కలెక్టర్‌తో పాటు అందరూ అశ్చర్యపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

వీడియో చూసిన నెటిజన్లు సైతం మహిళ సర్పంచ్‌ ప్రతిభను ప్రశంసించారు. ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి కలెక్టర్ చిరునవ్వు నవ్వి.. చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయింది.. అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీనా దాబీ జైపూర్‌లో ఉపాధి హామీ పథకం కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే బార్మర్‌కు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. 2015లో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే టీనా దాబీ టాపర్‌గా నిలిచారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..