AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO: కండోమ్ వాడకంలో ఏపీ ఏ స్థానంలో ఉందో తెల్సా..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కండోమ్ వాడకంపై ఒక నివేదికను విడుదల చేసింది. గతంతో పోలిస్తే ఇప్పుడు లైంగిక సంపర్కం సమయంలో కండోమ్‌ల వాడకం తగ్గుతోందని నివేదిక పేర్కొంది. కండోమ్‌ల వినియోగంపై వైద్యారోగ్యశాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. దాని వినియోగం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

WHO: కండోమ్ వాడకంలో ఏపీ ఏ స్థానంలో ఉందో తెల్సా..?
Condom
Ram Naramaneni
|

Updated on: Sep 20, 2024 | 5:58 PM

Share

అసురక్షిత శృంగారం మంచిది కాదని డాక్టర్లు పదే, పదే చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయంటారు. అందుకే శృంగారం చేసే సమయంలో కండోమ్ వాడాలని సూచిస్తారు. శృంగారం చేసేటప్పుడు సురక్షితమైన పద్దతులను పాటించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేసిన ఓ సర్వేలో వెల్లడైంది. శృంగార సంబంధిత అంశాలపై  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటీ.. అది అన్ని వర్గాల ప్రజలకు చేరువవ్వడం లేదు. నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ (2021-22) నిర్వహించిన సర్వే ప్రకారం, భారతదేశంలో అత్యధిక కండోమ్ వినియోగదారుల జాబితాలో దాద్రా నగర్ హవేలీ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 10 వేల జంటలలో 993 జంటలు శృంగార సమయంలో కండోమ్‌లను ఉపయోగిస్తున్నారని అంచనా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో  10 వేల జంటల్లో 978 మంది కండోమ్‌లు వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కర్ణాటకలో కండోమ్ వాడకంపై మరింత అవగాహన పెరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కండోమ్ వాడకంలో కర్ణాటక 15వ స్థానంలో ఉంది.  అక్కడ  10,000 జంటల్లో కేవలం 307 మంది మాత్రమే కండోమ్‌లు వాడుతున్నారు. పుదుచ్చేరిలో 960 జంటలు వినియోగిస్తున్నాయి. పంజాబ్ 895, చండీగఢ్ 822, హర్యానా 685, హిమాచల్ ప్రదేశ్ 567, రాజస్థాన్ 514, గుజరాత్‌లో 430 జంటలు శృంగారం సమయంలో కండోమ్‌లు వినియోగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో భారత్‌లో కండోమ్ లేకుండా శృంగారం చేసే ట్రెండ్ పెరిగిపోయిందని వెల్లడించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తే తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తే తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు