Viral Video: ఒక్కసారిగా దూసుకొచ్చిన 30మంది.. భయంతో ట్రైన్ వాష్‌రూమ్‌లో దాక్కున్న మహిళ.. వీడియో వైరల్..

బీహార్‌లోని కతిహార్ జంక్షన్‌లో జరిగిన ఓ భయంకర సంఘటనలో మహిళ భయంతో వాష్ రూమ్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. జానకీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్రమంగా రైలులోకి ప్రవేశించిన వారి గొడవతో భయపడి వాష్‌రూమ్‌లో దాక్కుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరకు ఏమైందంటే..?

Viral Video: ఒక్కసారిగా దూసుకొచ్చిన 30మంది.. భయంతో ట్రైన్ వాష్‌రూమ్‌లో దాక్కున్న మహిళ.. వీడియో వైరల్..
Woman Locks Herself In Train Washroom

Updated on: Dec 13, 2025 | 12:04 PM

ఒంటరిగా రైలులో ప్రయాణించే మహిళల భద్రత గురించి ఆందోళన కలిగించే ఒక భయంకరమైన సంఘటన బీహార్‌లోని కతిహార్ జంక్షన్‌లో జరిగింది. జైనగర్-మణిహరి జానకీ ఎక్స్‌ప్రెస్‌లో గొడవ జరగడంతో ఒక మహిళా ప్రయాణీకురాలు భయపడి రైలు వాష్‌రూమ్‌లో తలుపు వేసుకుని దాక్కుంది. కోచ్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తుల వల్ల పెద్ద గొడవ చెలరేగడంతో, మహిళా ప్రయాణీకురాలు భయంతో వాష్‌రూమ్‌ దాక్కుంది. రైలు కతిహార్ జంక్షన్‌లో ఆగిన సమయంలో ఈ భయానక పరిస్థితి నెలకొంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రైలు కతిహార్ జంక్షన్‌లో ఆగినప్పుడు దాదాపు 30 నుంచి 40 మంది యువకులు అరుస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ బలవంతంగా రైలు బోగీలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో వాష్‌రూమ్‌లో ఉన్న ఆ మహిళ ఈ గందరగోళం చూసి భయపడింది. తలుపు వద్ద జనం కిక్కిరిసి ఉండటంతో బయటికి రాలేకపోయింది. భయంతో వణికిపోయిన ఆమె తలుపు వద్ద కొడుతున్న శబ్దాలు విని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ వాష్‌రూమ్‌లోనే ఉండిపోయింది. అ క్రమంలో అక్కడ జరుగుతున్న దానిని వీడియో తీసింది.

ఇవి కూడా చదవండి

ఎమర్జెన్సీ కాల్.. RPF రక్షణ

ఆ మహిళ వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి సహాయం కోరింది. సకాలంలో స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆ బోగీలోకి చేరుకున్నారు. వారు అక్రమంగా వచ్చిన ప్రయాణీకులను పక్కకు పంపి మహిళకు దారి ఏర్పాటు చేశారు. చివరికి RPF సిబ్బంది ఆ మహిళను వాష్‌రూమ్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, ఆమె సీటు వద్దకు చేర్చారు.

మహిళ ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. మీరు బీహార్‌ను బాగు చేయలేరు తన పోస్ట్‌లో రైల్వే సేవను ట్యాగ్ చేసింది. తాను ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. కోచ్‌లో దుండగులు TTEతో కూడా వాదించుకున్నారని ఆమె జోడించింది. ప్రయాణంలో మహిళలకు భద్రత ఎంత అవసరమో తనకు ఇప్పుడు అర్థమైందని తెలిపింది.