AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అజ్ఞాత వ్యక్తి నుంచి షాకింగ్ లెటర్.. చదివిన మహిళ ఫ్యూజులు ఔట్.. అందులో ఏముందంటే?

ఎవ్వరైనా కూడా కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు.. వారి టేస్ట్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. సరిగ్గా ఇలాగే ఓ మహిళ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం...

Viral: అజ్ఞాత వ్యక్తి నుంచి షాకింగ్ లెటర్.. చదివిన మహిళ ఫ్యూజులు ఔట్.. అందులో ఏముందంటే?
Woman
Ravi Kiran
|

Updated on: Jul 27, 2021 | 3:11 PM

Share

ఎవ్వరైనా కూడా కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు.. వారి టేస్ట్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. సరిగ్గా ఇలాగే ఓ మహిళ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి.. ఆ ఇంటికి కొన్ని మార్పులు చేసింది. అయితే ఆ మార్పులే ఆమెను తలపట్టుకునేలా చేశాయి. సదరు మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి  లెటర్ రాశాడు.. ఆ లెటర్ ఆమె ఫ్యుజూలు ఎగిరిపోయేలా చేసింది. అసలు ఇంతకీ అందులో ఏముందో చూసేద్దాం పదండి.!

ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో జరిగింది. 26 ఏళ్ల సారా యేట్స్ రీసెంట్‌గా ఓ ఇల్లు కొనుక్కుంది. స్టాక్‌పోర్ట్‌లోని ఆమె నివాసానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంది. అందులో భాగంగానే తన బాత్రూమ్‌ను లావిష్‌గా డిజైన్ చేసుకుని కొత్త లైట్స్ కూడా పెట్టింది. లైట్ ఆన్స్ చేసిన సమయంలో బయటవారు చూడగలరా.? లేదా.? అనేది కూడా సారా నిర్ధారించుకుని.. ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే ఆమె అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి.. కొద్దిరోజులకు ఆమె గేట్‌కు ఉన్న పోస్ట్‌బాక్స్‌కు ఓ లెటర్ వచ్చింది. దానిని చదివి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది.

Letter

ఆ లెటర్ సారంశం ఇది.. ”మీ ఇంటి బాత్రూమ్ కిటికీకి ఏదైనా అడ్డుపెట్టాలి. లేదంటే ప్రతీది కనిపిస్తుంది. మీ తలుపు తట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇదంతా” అని పేర్కొంది. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన సారా ఇటీవల తన ఇంట్లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలిపింది. ఇటీవల సెలవుల తరువాత గ్రీస్ నుండి తిరిగి వచ్చిన సారాకు.. ఈ లెటర్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ కిటికీ ద్వారా అంతా బయటికి కనిపిస్తుందని తెలియదు. ఆ లేఖ వచ్చిన తర్వాత.. బయటపడింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని.. 10 రోజుల అనంతరం మరమ్మత్తులు చేపడతానని సారా స్పష్టం చేసింది.

Woman 1

ఇవి కూడా చదవండి:

మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

 మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

పాకిస్థాన్‌లో పుట్టాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.. అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు!

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!