అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక దేశీ జుగాడ్‌లను చూస్తుంటాం. కొంత మంది సైకిల్‌ను బైక్‌లా మార్చుకొని వాడుకుంటారు. మరికొందరు… బైకునే కారులా చేసుకుంటారు. ఇక మహిళలు ఇంటి పని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఇటుకలతో వాషింగ్ మెషీన్ తయారు చేస్తే.. ఆ బట్టలు ఈజీగా ఆరబెట్టేందుకు భలే టెక్నిక్ ప్రదర్శించింది మరో మహిళ. ఉతికిన దుస్తులు ఆరబెట్టేందుకు బకెట్‌తో చేసిన టెక్నిక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక మహిళ దేశీ జుగాడ్‌తో బట్టలు ఆరబెట్టడం కనిపించింది. ఉతికిన బట్టలను ఓ బకెట్‌లో తీసుకొచ్చిన ఆమె.. అక్కడే ఓ తాడుకు ఇంకో బకెట్‌ను కట్టి వేలాడదీసింది. దానికి కట్టిన తాడును ఎన్నో మెలికలు మెలికలుగా తిప్పి కట్టింది. ఉతికిన బట్టలు అందులో వేసి బకెట్‌ను వదిలేస్తుంది. దీంతో మెలికలు తిరిగిన తాళ్లు మామూలు స్థితికి వచ్చే క్రమంలో బకెట్ గిరగిరా వేగంగా తిరుగుతుంది. ఇలా బకెట్ వేగంగా తిరగడం వల్ల ఆ పచ్చి బట్టల్లోని నీరు మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా వాషింగ్‌మెషిన్‌లో ఉతికిన బట్టలు డ్రైయర్ చేస్తున్న విధంగా బకెట్‌తో ఈమె చేసిన ప్రయోగం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈమె తెలివి మామూలుగా లేదంటూ నెటిజన్లు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. రూపాయి ఖర్చులేని వాషింగ్‌మెషిన్.. చాలా బాగుందంటూ పలువురు కామెంట్ చేశారు. వీడియో చూసిన మరికొందరు నెటిజన్లు ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. వైరల్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 5లక్షలకు పైగా వ్యూస్తో నెట్టింట దూసుకుపోతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..