మాయదారి కరోనా ఎఫెక్ట్.. ప్రపంచంలో ఇంకెవరూ ఇలా పెళ్లి చేసుకుని ఉండరు.. చూసి ఉండరు..

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే దాదాపుగా స్తంభించిపోయింది. ఎంతో మంది తమ పెళ్లిళ్లను, ఇతర శుభ కార్యాలను కరోనా కారణంగా...

మాయదారి కరోనా ఎఫెక్ట్.. ప్రపంచంలో ఇంకెవరూ ఇలా పెళ్లి చేసుకుని ఉండరు.. చూసి ఉండరు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 04, 2020 | 4:27 PM

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే దాదాపుగా స్తంభించిపోయింది. ఎంతో మంది తమ పెళ్లిళ్లను, ఇతర శుభ కార్యాలను కరోనా కారణంగా క్యాన్సల్ చేసుకున్నారు. అయితే ఓ జంట మాత్రం కరోనాకు వెరవలేదు. వధువుకు కరోనా సోకినప్పటికీ పెళ్లి తంతును ఆపలేదు. భౌతిక దూరం పాటిస్తూనే ఇద్దరూ మనువాడారు. వారి సంప్రదాయం మేరకు రింగులు మార్చుకుని ఒక్కటయ్యారు. వధువరులిద్దరూ దూరం ఉండి పెళ్లి ఎలా చేసుకుంటారని సందేహపడకండి. ఆ విషయంలోకే వెళ్దాం.. లారెన్, పాట్రిక్ డెల్గడో జంట నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. గత ఏడాది మేలో వారికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అప్పటి నుంచి ఆ జంట తమ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చింది. చివరికి ఆ తేదీ రానే వచ్చింది. కానీ అంతలోనే కరోనా మహమ్మారి వారికి ఝలక్ ఇచ్చింది. సరిగ్గా పెళ్లికి ఐదు రోజుల ముందు వధువుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. మరోవైపు వారి పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్న లైసెన్స్ గడువు ముగియనుంది. దీంతో లారెన్, పాట్రిక్ తమ కుటుంబ సభ్యులో చర్చించి.. కరోనా ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వధువు ఇంట్లోనే వివాహా కార్యక్రమాన్ని ఎలాంటి అవాంతరం లేకుండా సాఫీగా పూర్తి చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో గల రూమ్ కిటకీ వద్ద వధవు.. ఇంటి ముందు గ్రౌండ్‌లో వరుడు.. ఉన్నారు. ఇద్దరూ ఒక రిబ్బన్ సహాయంతో ఉంగరాలను మార్చుకున్నారు. ఇలా వారి సంప్రదాయం ప్రకారం వివాహ తంతును పూర్తి చేశారు. మొత్తం మీద తమ కల సాకారం అవడంతో ఆ నవ దంపతుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇప్పుడు వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వెరల్ అవుతున్నాయి. అయితే ఆ నవ వధువు కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని, వారి దాంపత్య జీవితం కలకాలం వర్ధిల్లాలని మనమూ కోరుకుందాం.