ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో బిజీగా ఉన్నారు. సరైన తిండి, నిద్ర కూడా కరువైంది. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఈ కారణంగా వారు తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి టైమ్‌కు తినేస్తున్నారు. లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తారు. ఇంట్లోనే కూర్చుని వేడి ఆహారాన్ని ఆర్డర్ చేసే అనేక యాప్‌లు ఉన్నాయి. అలాగే, ఇక్కడ కూడా ఒక వెజిటేరియన్ మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. కానీ, రెస్టారెంట్ పొరపాటు కారణంగా ఆమెకు నాన్‌వెజ్ డెలీవరి అయ్యింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది..రెస్టారెంట్‌పై భారీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆ మహిళ డిమాండ్ చేస్తోంది. ఈ షాకింగ్ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.
అహ్మదాబాద్‌లోని చాముందగర్‌లో నివాసం ఉండే ఓ మహిళ ఆన్‌లైన్‌లో చీజ్ శాండ్‌విచ్‌ని ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలీవరి అయ్యింది. శాండ్‌విచ్‌ను కొద్దిగా తిన్నప్పుడు అది ఆమెకు చికెన్‌లా అనిపించింది..వెంటనే అది చీజ్ కాదని అతను గ్రహించింది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. సదరు రెస్టారెంట్‌పై రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఆ మహిళ పేరు నిరాలీ పర్మార్. తాను ఆన్‌లైన్ పనీర్ టిక్కా శాండ్‌విచ్‌ని ఆర్డర్ చేశానని, అయితే ఆ తర్వాత డెలివరీ చేసినది చీజ్ కాదని, చికెన్ శాండ్‌విచ్ అని తెలిసింది. తాను శాఖాహారిని అని, నాన్ వెజ్ తినడాన్ని తన మతం అనుమతించదని ఆ మహిళ చెప్పింది. రెస్టారెంట్ చేసిన ఈ తప్పిదంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని, రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
అయితే, ఈ ఫిర్యాదుపై ఆరోగ్య శాఖ రెస్టారెంట్‌కు నోటీసు జారీ చేసింది. దీంతో పాటు రెస్టారెంట్‌కు రూ.5 వేల జరిమానా కూడా విధించింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరిగితే రెస్టారెంట్‌ను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..