
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రమే వీక్షకులను నోరెళ్లబెట్టేలా చేస్తాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచంలో ప్రమాదానికి భయపడని, ఎంత పెద్ద రిస్క్‌నైనా చాలా సులభంగా తీసుకోగల ధైర్యవంతులు ఉన్నారని ఈ వీడియో నిరూపిస్తుంది. ఒక మహిళ తన భుజంపై ఒక భారీ కొండచిలువతో పోజులిచ్చిన దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక మహిళ తన భుజంపై అత్యంత భారీ కొండచిలువను మోయడం చూడవచ్చు. ఈ కొండచిలువ పరిమాణం చూసి ఎవరైనా భయపడక మానరు. సాధారణంగా చిన్న పాములను చూసినా పరుగులు తీసే మనుషులు ఉంటారు. అలాంటిది ఆ స్త్రీ తన శరీరంపై ఇంత పెద్ద, ప్రమాదకరమైన జీవిని ఎటువంటి భయం లేకుండా మోయడం ఆశ్చర్యకరం. వీడియోలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కొండచిలువ నెమ్మదిగా కదులుతూ ఆ స్త్రీ కాళ్ళలో ఒకదానిని చుట్టుకుంటుంది. అయినప్పటికీ ఆమె ముఖంలో భయం ఏమాత్రం కనిపించదు. చాలా ప్రశాంతంగా, ధీమాగా ఆమె పోజులివ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ డేంజరస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @thereptilezoo అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే లక్షలాది మందిని ఆకర్షించింది. వేల లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది యూజర్లు ఆ మహిళను స్నేక్ గర్ల్ అని పిలవగా.. మరికొందరు “ఆమె మనిషా కాదా..? ఆమెకు అస్సలు భయం లేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు మాత్రం ఇలాంటి పెద్ద జంతువులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి