నీటి అడుగున మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అందుకే మొసలిని ‘సముద్రపు అలెగ్జాండర్’ అని పిలుస్తుంటారు. అంతటి బలశాలి అయిన మొసలి నోటికి చిక్కినట్లే చిక్కి అడవి దున్న తప్పించుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం పదండి.!
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఆఫ్రికన్ అడవి దున్న నదిని దాటుతుంది. సరిగ్గా మధ్యకు వచ్చేసరికి దానిపై మొసలి మెరుపు దాడి చేస్తుంది. తన పదునైన దవడలతో అడవి దున్నను నీటిలోకి లాగేందుకు మొసలి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే అడవి దున్న తన శక్తిని మొత్తం కూడగట్టుకుని.. ఆ మొసలి నుంచి తప్పించుకుంటుంది. ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటుంది. ఈ షాకింగ్ వీడియోను ”iftirass” అనే ట్విట్టర్ ఖాతా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అడవి దున్న గుండె ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.
لقطات مذهلة..
تمساح امسك بحيوان النو أثناء #هجرة_حيوانات_النو وعبور النهر..
شاهد لآخر المقطع….؛ pic.twitter.com/8w8sbM3cwQ— إفتراس | prey (@iftirass) August 1, 2021
Read Also: 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. కాంస్యం సొంతం
బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!
మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!