Viral: కాపురం చేయాలంటే.. ప్రతినెలా భర్త డబ్బులు ఇవ్వాల్సిందే.. షాకింగ్ కండీషన్ పెట్టిన భార్య.. ఎందుకంటే?

|

Aug 14, 2022 | 7:30 AM

బీహార్‌లోని పూర్నియాలో భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవ వెలుగులోకి రావడంతో పోలీస్ కౌన్సెలింగ్ సెంటర్ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. అత్తమామల ఇంట్లో భర్తతో కలిసి ఉండేందుకు ఓ వింత షరతు పెట్టింది.

Viral: కాపురం చేయాలంటే.. ప్రతినెలా భర్త డబ్బులు ఇవ్వాల్సిందే.. షాకింగ్ కండీషన్ పెట్టిన భార్య.. ఎందుకంటే?
Relationship
Follow us on

బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని పోలీస్ కౌన్సెలింగ్ సెంటర్ దగ్గరకు భార్యాభర్తల ఉదంతం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భర్తతో కలిసి అత్తమామల ఇంట్లో ఉండేందుకు అతడి భార్య ఓ వింత షరతు పెట్టడం పోలీసు కౌన్సెలింగ్ సెంటర్ సభ్యులను విస్మయానికి గురి చేసింది. భర్త నెలకు రూ.5000 ఇస్తేనే అత్తమామలతో కలిసి వారి ఇంట్లో భర్తతో కలిసి జీవిస్తానని మహిళ షరతు విధించింది. ఎందుకు ఇలాంటి షరతు పెడుతున్నావని ఆమెను ప్రశ్నించగా.. భర్త నన్ను వదిలేసి ఢిల్లీ-పంజాబ్‌కు వెళ్లి సంపాదిస్తున్నాడని, నేను ఇక్కడ ఇల్లు ఎలా నడుపుతున్నానో నాకు మాత్రమే తెలుసునని ఆ మహిళ చెప్పుకొచ్చింది.

నేను అత్తమామల ఇంట్లోనే ఉంటాను. కానీ, నా భర్త నాకు ప్రతి నెలా రూ.5000లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆ మహిళ పేర్కొంది. అయితే భార్య ఈ షరతుకు భర్త కూడా అంగీకరించి, ఈసారి బయటకు వెళ్లే ముందు భార్య ఖాతా తెరిచి అందులో డబ్బులు జమ చేసిన తర్వాతే వెళ్తానని చెప్పుకొచ్చాడు.

ప్రతి నెలా రూ.5000లు భార్య ఖాతాకు పంపిస్తానని భర్త హామీ ఇచ్చాడు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసు కౌన్సెలింగ్ సెంటర్‌లో బాండ్‌ కుదుర్చుకుని పరస్పర అంగీకారంతో సంతకాలు చేసి వివాదాన్ని విరమించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో ఆగస్టు 12న మొత్తం 25 కేసులు రాగా, అందులో 12 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 6 వివాదాలు పరిష్కారం కాగా 6 కేసులు పరిష్కారం కాలేదు. అలాంటి వారు కోర్టుకు వెళ్లాలని సూచించారు.

మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమారి, సభ్యులు దిలీప్ కుమార్ దీపక్, స్వాతి వైశ్యంత్రి, రవీంద్ర షా, జీనత్ రెహ్మాన్, ఆఫీస్ అసిస్టెంట్ నారాయణ్ కుమార్ గుప్తా కేసును ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించారు.