Watch Video: డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన భర్తను పొట్టు పొట్టుగా తన్నిన భార్య.. ఏం కొట్టుడు సామీ ఇది..

|

May 09, 2023 | 3:10 PM

Wife Beating Husband Video: భార్యభర్తలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తూనే ఉంటాం. వీటిలో దంపతులిద్దరూ కలిసి చేసిన ఫన్నీ రీల్స్ కొన్ని ఉంటే.. మరికొన్ని భార్యభర్తల గిల్లికజ్జాలకు సంబంధించినవి ఉంటాయి. ఇక కొన్ని వీడియోలైతే..

Watch Video: డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన భర్తను పొట్టు పొట్టుగా తన్నిన భార్య.. ఏం కొట్టుడు సామీ ఇది..
Couple Fighting
Follow us on

భార్యభర్తలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తూనే ఉంటాం. వీటిలో దంపతులిద్దరూ కలిసి చేసిన ఫన్నీ రీల్స్ కొన్ని ఉంటే.. మరికొన్ని భార్యభర్తల గిల్లికజ్జాలకు సంబంధించినవి ఉంటాయి. ఇక కొన్ని వీడియోలైతే.. బాబోయ్ అనిపించేలా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ తన భర్తను పొట్టు పొట్టుగా కొట్టడం చూడొచ్చు. అవును, అప్పుడే ఇంటికి వచ్చిన భర్తను మడతపెట్టి కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది.

భార్యభర్తల మధ్య గొడవలు సహజం. కొన్ని కొన్నిసార్లు ఆ గొడవలు హద్దులు దాటిపోతాయి. చాలా వరకు అయితే భర్తలు, తమ భార్యలపై భౌతిక దాడులకు పాల్పడుతారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది. భర్త ఇంటికి రావడమే ఆలస్యం.. సింహంలా మీదకు దూకి.. ఒళ్లు హూనమయ్యేలా కొట్టేసింది. ఈ వీడియోలో వ్యక్తి అప్పుడే ఇంటికి వచ్చాడు. భుజనా ఉన్న బ్యాగ్, తలకు ఉన్న హెల్మెట్ తీసి పక్కన పెట్టాడు. అంతే.. అటు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చింది మహిళ. అతనిపై దూకి.. వంగబెట్టి వీర బాదుడు బాదింది. కాలితో తంతూ.. పిడికిలితో పిడిగుద్దులు గుద్దుతూ అతనికి చుక్కలు చూపించింది. మహిళ కొట్టిన దెబ్బలకు అల్లాడిపోయాడు ఆ వ్యక్తి.

ఇవి కూడా చదవండి

అయితే, ఆ మహిళ తన భర్తను అలా కొట్టడం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. డ్యూటీకి వెళ్లే ముందు డస్ట్ బిన్ తీసుకెళ్లమని భర్తను కోరిందట ఆ మహిళ. అయితే, అతను డస్ట్ బిన్ తీసుకెళ్లడం మరిచాడట. దాంతో ఇంటికి తిరిగి వచ్చాక అతని పరిస్థితి ఇలా అయ్యింది. మహిళ తన భర్తను కొట్టిన దృశ్యాలు ఇంట్లో అమర్చిన సిసి టీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.

దంపతుల ఫైటింగ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఏం కొట్టుడు సామీ అని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎందుకలా కొట్టిందని అవాక్కయ్యారు. వీడియోకు ఇప్పటి వరకు 85 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..