సాధారణంగా పాములంటేనే చాలామంది భయపడుతుంటారు. ఎన్నో విషపూరితమైన పాములు ఉన్నాయి.. అవి కాటేస్తే.. క్షణాల్లో పైప్రాణాలు పైకిపోతాయి. ఇక ప్రపంచంలో 2700 పాము జాతులు ఉండగా.. వీటిల్లో 10 శాతం మాత్రమే విషపూరితమైనవి. అలాగే పాములకు సంబంధించి కొన్ని అపోహలు, నమ్మకాలు చాలానే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పాములు ఎక్కువగా మనిషి శరీరంలో చేతులు, పాదాలు, చీలమండ వంటి భాగాలపైనే కాటు వేస్తుంటాయి. అసలు ఎందుకని ఈ భాగాలపైనే పాములు కాటేస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా.? ఆ సందేహాలను పలువురు నిపుణులు సమాధానమిచ్చారు.
ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే
సహజంగా సరీసృపాలు అనేవి నేలపై పాకే జీవులు. ఎక్కువగా పొదల్లో, రాళ్లల్లో, బొరియల్లో, పొలం గట్లపై తిరగాడుతుంటాయి. ఇక రాత్రివేళ తమ ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. ఏ పామూ కూడా కావాలని మనుషులను కాటు వేయవు. మనుషులు అనుకోకుండా వాటిని కాలుతో తొక్కినప్పుడో, వాటిని తాకినప్పుడో.. లేదా ఏదైనా వస్తువు కోసం వెతికినప్పుడు చెయ్యి తగిలితేనో భయంతో వెంటనే అలెర్ట్ అయ్యి.. తమకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించి కాటు వేస్తాయి.
ఇక మనుషులు వాటిని కాలుతో తోక్కినప్పుడో.. చేతితో తాకినప్పుడో కాటేసిన సందర్భాలే ఎక్కువ. అవి పాకే జీవులు.. పైగా పడగ విప్పితే.. వాటి తల.. మనిషి మోకాళ్ల వరకు వస్తుంది. కాబట్టే ఎక్కువగా పాములు నడుము కింద భాగం, కాళ్లు, చీలమండలం, చేతులు లాంటి భాగాలపై కాటు వేస్తుంటాయి.
ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..