తెల్లరంగు కప్ప.. భలేగా ఉందే.. యూపీలో గుర్తించిన పరిశోధకులు..! విషయం ఏంటంటే..

|

Jul 29, 2024 | 5:11 PM

శాస్త్రవేత్తలు గర్తించిన ఈ హప్లోబాట్రకస్‌ టైగెరినస్‌ జాతి కప్పలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయని వెల్లడించారు. జీవిలో పిగ్మెంటేషన్‌ జరగకపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయని, అందులో జన్యుపరమైన కారణాలు ప్రధానమైనవని చెప్పారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వ్యాధులు, ఉష్ణోగ్రతలు, చర్మంపై ఉండే ద్రవం, కాలుష్యం, ఆహార లభ్యత కూడా కారణాలవుతాయని తెలిపారు.

తెల్లరంగు కప్ప.. భలేగా ఉందే.. యూపీలో గుర్తించిన పరిశోధకులు..! విషయం ఏంటంటే..
White Frog
Follow us on

సాధరణంగా కప్పలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు..! గ్రామాల్లో కప్పలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. వర్షాకాలంలో చెరువులు, కుంటలు నిండినప్పుడు కప్పల గోల ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ కప్పలు గ్రే కలర్‌లో, ముదురు గోధుమ రంగు, పసుపు రంగులో కొన్ని కొన్ని కప్పలు ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి. కానీ, మీరేప్పుడైనా పూర్తిగా తెలుపు రంగులో ఉన్న కప్పలు చూశారా..? అయితే, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పూర్తిగా తెలుపురంగులో ఉన్న కప్పను గుర్తించారు పరిశోధకులు. ఇది దేశంలో తొలిసారిగా కనిపించిన తెల్ల కప్పగా, అరుదైన కప్పగా రికార్డుల్లోకి ఎక్కింది. హప్లోబాట్రకస్‌ టైగెరినస్‌ అనే ఇండియన్ బుల్‌ ఫ్రాగ్‌ జాతిలో అరుదైన తెల్ల కప్పను గుర్తించారు.

ఉత్తరప్రదేశ్‌లోని దుద్వా టైగర్‌ రిజర్వ్‌లోగల సుహేలీ నది పరివాహక ప్రాంతంలో ఈ కప్పను గుర్తించారు పరిశోధకులు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాబిన్‌ సుయేశ్‌ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన స్వస్థిక్‌ పీ పాధీ, TERI స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు చెందిన హర్షిత్‌ చావ్లా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని హెర్పటాలజీ నోట్స్ అనే పరిశోధన పత్రంలో ముద్రించారు.

ఈ అరుదైన తెల్లకప్పను 2021 డిసెంబర్‌ 3న కనిపెట్టారు. ఈ కప్పలో కళ్లు మినహా మిగతా భాగమంతా తెల్లగా ఉంది. కప్ప చర్మంలో పిగ్మెంటేషన్‌ జరగకపోవడమే ఇందుకు కారణమని, ఈ పరిస్థితిని లూసిజమ్‌ అంటారని పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్తలు గర్తించిన ఈ హప్లోబాట్రకస్‌ టైగెరినస్‌ జాతి కప్పలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయని వెల్లడించారు. జీవిలో పిగ్మెంటేషన్‌ జరగకపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయని, అందులో జన్యుపరమైన కారణాలు ప్రధానమైనవని చెప్పారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వ్యాధులు, ఉష్ణోగ్రతలు, చర్మంపై ఉండే ద్రవం, కాలుష్యం, ఆహార లభ్యత కూడా కారణాలవుతాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి