
మనం ప్రతిరోజూ వేల కొద్దీ పదాలు మాట్లాడుతుంటాం.. రాస్తుంటాం. కానీ ఏ అక్షరాన్ని మనం ఎక్కువగా వాడుతున్నాం అనే విషయంపై ఎప్పుడైనా ఫోకస్ పెట్టారా..? ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే ఇంగ్లీషుపై భాషా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. ఇంగ్లీష్ లెటర్స్‌లో ఒక అక్షరం మిగతా అన్నింటికంటే అత్యంత శక్తివంతమైనదిగా, ఎక్కువగా వాడబడేదిగా గుర్తింపు పొందింది.
పరిశోధనల ప్రకారం.. ఇంగ్లీషులో అత్యధికంగా ఉపయోగించే అక్షరం E. పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆన్‌లైన్ ఆర్టికల్స్, రోజువారీ మాటల్లో వాడే మొత్తం అక్షరాలలో కేవలం E అక్షరమే 11 నుండి 12 శాతం వరకు ఉంటుంది. అంటే మనం రాసే ప్రతి వంద అక్షరాలలో సుమారు 12 అక్షరాలు E అయి ఉంటాయి.
ఇంగ్లీషులో మనం ఎక్కువగా వాడే పదం the. ఇందులో E ఉండటం వల్ల దీని వాడకం గణనీయంగా పెరిగింది. మనం నిత్యం వాడే he, she, me, we, they వంటి పదాలలో E అంతర్భాగంగా ఉంది. be, were, there, here వంటి సాధారణ పదాలన్నీ E అక్షరంపైనే ఆధారపడి ఉన్నాయి. వ్యాకరణ పరంగా కూడా E అక్షరం చాలా కీలకం. చాలా నామవాచకాలు బహువచనంలోకి మారినప్పుడు చివరన es చేరుతుంది. వెర్బ్ పాస్ట్ టెన్స్‌లోకి మారినప్పుడు చివరన ed చేరుతుంది. ఈ చిన్న వ్యాకరణ నియమాల వల్ల కోట్లాది వాక్యాలలో E అక్షరం పదేపదే రిపీట్ అవుతుంది.
ఇంగ్లీషులో E తర్వాత అత్యధికంగా వాడే అక్షరం T. దీని తర్వాత A మూడవ స్థానంలో ఉంది. అయినప్పటికీ E అక్షరానికి ఉన్న ప్రాధాన్యత మరే ఇతర అక్షరానికీ లేదని భాషా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..