AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాజ్ మహల్ అసలు పేరు ఏంటో తెలుసా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..

ప్రపంచ సప్త అద్భుతాలలో ఒకటైన తాజ్ మహల్ గురించి మనందరికీ ఏం తెలుసు? షాజహాన్ తన ప్రియసఖి ముంతాజ్ జ్ఞాపకార్థం కట్టించిన ఒక తెల్ల పాలరాతి అద్భుతం అని, ప్రేమకు సజీవ సాక్ష్యం అని చెబుతాం. కానీ చరిత్ర పుటల ప్రకారం అసలు తాజ్ మహల్ అనేది దాని పేరే కాదట.. దాన్ని అసలు పేరు చాలామందికి తెలియదు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తాజ్ మహల్ అసలు పేరు ఏంటో తెలుసా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..
What Was Taj Mahal Original Name
Krishna S
|

Updated on: May 18, 2026 | 8:40 AM

Share

ప్రేమకు సజీవ సాక్ష్యం.. ప్రపంచ సప్త అద్భుతాలలో ఒకటి.. షాజహాన్ తన ప్రియసఖి ముంతాజ్ కోసం నిర్మించిన పాలరాతి సమాధి..తాజ్ మహల్ గురించి అందరికీ తెలుసు. కానీ చరిత్రకారుల పరిశోధనల ప్రకారం తాజ్ మహల్ అనేది దాని అసలు పేరే కాదట.. అవును, ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మంది ప్రజలు దీనిని తాజ్ మహల్ అనే నమ్ముతారు. కానీ ఈ అపురూప కట్టడం వెనుక ఒక చారిత్రక పేరు అంతకు మించిన ఆసక్తికరమైన కథ ఉంది.

రౌజా ఎ మునవ్వర్.. అసలు పేరు వెనుక కథ

యమునా నదీ తీరంలో తెల్లని సౌందర్యంలా నిలబడి, రాతిలో చెక్కిన ప్రేమ కావ్యంగా తాజ్ మహల్ విరాజిల్లుతోంది. అయితే మొఘల్ కాలపు అధికారిక పత్రాల ప్రకారం.. ఈ అద్భుతమైన సమాధిని నిర్మించినప్పుడు దానికి మొదట రౌజా ఎ మునవ్వర్ అని పేరు పెట్టారు. పర్షియన్ భాషలో దీని అర్థం అత్యంత ప్రకాశవంతమైన సమాధి లేదా అత్యంత విశిష్టమైన స్మారక చిహ్నం. ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. షాజహాన్‌తో వివాహం తర్వాత ఆమెకు ముంతాజ్ మహల్ అనే బిరుదు లభించింది. ఆమె మరణానంతరం నిర్మించిన ఈ సమాధికి రౌజా ఎ మునవ్వర్ అని నామకరణం చేసినప్పటికీ.. కాలక్రమేణా ఆమె పేరులోని చివరి భాగమైన ముంతాజ్ మహల్ అనేది సంక్షిప్తంగా మారి, జనాల నాలుకలపై తాజ్ మహల్‌గా స్థిరపడిపోయింది.

22 ఏళ్ల శ్రమ.. 20,000 మంది కళాకారులు..

ఈ అద్భుత కట్టడం నిర్మాణం క్రీ.శ. 1632లో ప్రారంభమై సుమారు 22 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దీనిని పూర్తి చేయడానికి 20,000 మందికి పైగా కార్మికులు, శిల్పులు, కళాకారులు రేయింబవళ్లు శ్రమించారు. ప్రసిద్ధ వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ దీనికి ప్రధాన రూపకర్త. ఈ స్మారక చిహ్నం వైభవం కోసం రాజస్థాన్‌లోని మక్రానా నుండి ప్రత్యేక తెల్ల పాలరాయిని, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించిన 28 రకాల విలువైన రత్నాలను ఉపయోగించారు.

మైండ్ బ్లోయింగ్ వాస్తు నైపుణ్యం

తాజ్ మహల్ ఇస్లామిక్, పర్షియన్, భారతీయ వాస్తు శైలుల అద్భుత సమ్మేళనం. దీని నిర్మాణంలో ఉన్న కొన్ని ఇంజనీరింగ్ అద్భుతాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తాయి.

వంగి ఉన్న మినార్లు: తాజ్ మహల్ నాలుగు మూలల్లోని స్తంభాలు స్ట్రెయిట్‌గా కాకుండా కొద్దిగా బయటకు వంగి ఉంటాయి. భూకంపం లేదా భారీ విపత్తు సంభవించినా.. ఆ స్తంభాలు ప్రధాన గోపురంపై పడకుండా బయట వైపు పడిపోయేలా ఆ కాలంలోనే ఈ సాంకేతికతను వాడారు.

పియెట్రా డ్యూరా కళ: పాలరాయిపై రత్నాలతో చెక్కిన పూల డిజైన్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా మెరిసిపోతుంటాయి.

ఆప్టికల్ ఇల్యూషన్ : మీరు తాజ్ మహల్ మెయిన్ గేట్ గుండా లోపలికి వెళ్తున్నప్పుడు, ఆ కట్టడం మీకు చాలా పెద్దదిగా, దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మీరు దగ్గరికి వెళ్లేకొద్దీ అది చిన్నదవుతున్నట్టు భ్రాంతి కలుగుతుంది. ఇదొక అద్భుతమైన ఆర్కిటెక్చరల్ ట్రిక్.

వివాదాలు – తేజో మహాలయ వాదన

ఇటీవలి దశాబ్దాలలో తాజ్ మహల్ చుట్టూ కొన్ని భిన్నాభిప్రాయాలు, వివాదాలు కూడా నడుస్తున్నాయి. కొంతమంది చరిత్రకారులు, పరిశోధకులు ఇది వాస్తవానికి ఒక పురాతన శివాలయం అని, దీని పేరు తేజో మహాలయ అని గట్టిగా వాదిస్తున్నారు. అయితే అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలు, మొఘల్ పత్రాల ఆధారంగా దీనిని షాజహాన్ నిర్మించిన సమాధిగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అలాగే 1983లోనే దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

Follow Us