Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫోటోలు ఇటీవల బాగా వైరల్ అవుతున్నాయి. ఒక దృశ్యాన్ని మనం చూసే దృక్కోణంపై మన ఆలోచనలు ఎలా ఉంటాయన్నదానిని అంచనా వేయడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోల ముఖ్య ఉద్దేశం. సాధారణంగా సైకియాట్రిస్ట్‌లు ఇలాంటి ఫోటోలను చూపించి మన ఆలోచనలను అంచనా వేస్తారు. నిజానికి ఈ ఆప్టికల్ ఇల్యూజన్ టెక్నిక్ ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నా తాజాగా సోషల్ మీడియా (Social Media) విస్తృతి పెరిగినప్పటి నుంచి అందరికీ పరిచయమవుతోంది. సోషల్‌మీడియాలో ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేస్తూ మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి.? అంటూ పోస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఫోటోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పైన కనిపిస్తోన్న ఫోటో చూడగానే మీకు ఏం కనిపిస్తుంది.? ఒకటి యాపిల్, రెండోది దీర్ఘంగా చూస్తే రెండు ముఖాలు ఎదురెదురుగా ఉన్నట్లు కనిపిస్తోంది కదూ. అయితే ఈ రెండింటిలో ఏది మొదట కనిపిస్తుందో దాని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఈ ఫోటోను ఎడ్జర్ రుబిన్ అనే ప్రముఖ సైకాలజిస్ట్ 1915లో రూపొందించారు. ఈ ఫోటో ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేసేవారు.
ఫోటోను చూడగానే ముందుగా యాపిల్ కనిపిస్తే మీరు మీ జీవితం పట్ల సంతోషంగా ఉన్నారని అర్థం. పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని అంగీకరిస్తారు. మీకు సన్నిహితులుగా భావించే వారిపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. వారు మీకు సహాయం చేస్తారనే నమ్మకంతో ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మీలోని సానుకూల దృక్పథాన్ని ఇతరులకు పంచుతారు.
ఒకవేళ మీకు ఫోటో చూడగానే ఎదురెదురుగా ఉన్న ముఖాలు కనిపిస్తే.. మీరు బంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని అర్థం. అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో వారితోనే అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ దూరం ఎక్కువ కాలం కొనసాగకుండా ఉండాలంటే వారితో కూర్చొని మాట్లాడాలి అలా చేస్తే సమస్యలు దూరమవుతాయి.
Andhra Pradesh: ఆ ఇంటి యజమానిది గుండె కాదు రాయి… అద్దెకు ఉన్న వ్యక్తి చనిపోతే..
Tinda Benefits: చాలామందికి తెలియని కూరగాయ టిండా.. వేసవిలో షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ ఆహారం..