మన ప్రపంచంలా కాదు.. మనిషికి తెలియని ఎన్నో రహస్యాలు, మరెన్నో వింతలు సముద్రపుటడుగున చాలానే ఉన్నాయి. సముద్రపు జీవరాశులను మనం కొన్నే చూసి ఉంటాం. కానీ లోతైన సముద్రంలో మనకు తెలియని ఎన్నో జీవులు దాగి ఉన్నాయి. వాటిని చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఇటీవల ఈ కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకెళ్తే.. పసిఫిక్ మహాసముద్ర తీరానికి ఓ వింత జీవి కొట్టుకొచ్చింది. అది అచ్చం ‘ఫైండింగ్ నెమో’ చిత్రంలోని చేప మాదిరి ఉండటంతో.. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై స్థానిక మెరైన్ మ్యూజియం సీసైడ్ అక్వేరియం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘2000-3300 అడుగుల సముద్రపుటడుగున నివసించే ఈ చేపను మనుషులు చాలా అరుదుగా చూసి ఉంటారు’ అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఈ చేపకు సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా 31 జాతులను కనుగొన్నామన్నారు. పసిఫిక్ ఫుట్‌బాల్ చేప అని పిలవబడ్డ.. దీనిని న్యూజిలాండ్, జపాన్, రష్యా, హవాయి, ఈక్వెడార్, చిలీ, కాలిఫోర్నియా వంటి దేశాలు చూశామన్నారు. ఈ జాతికి చెందిన జీవరాశుల్లో మగ, ఆడ అనే తేడా కనుగొనడం కష్టమని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక ఈ చేపలు తమ ఎరను పట్టుకునేందుకు నుదిటిపై ఫాస్ఫోరేసెంట్ బల్బుల నుండి కాంతిని వినియోగిస్తాయని చెప్పుకొచ్చారు.
ఇది చదవండి: రోడ్డుపై అనుమానాస్పదంగా గోనె సంచి.. పెట్రోలింగ్ పోలీసులు విప్పి చూడగా.!
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి