Viral Video: చాక్లెట్ దోసెను వేస్తున్న వ్యక్తి.. మమ్మల్ని ఫుడ్ తిననివ్వండి అంటూ నెటిజన్లు ఫైర్

|

Jul 01, 2023 | 1:24 PM

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి టిఫిన్ సెంటర్ లో చాక్లెట్ దోసెను తయారు చేస్తున్నాడు. కిట్ క్యాట్ తో దోసె తయారు చేయడమే కాదు.. దోస రెడీ అయిన తర్వాత పైన చీజ్ ను తర్వాత కిట్-క్యాట్ చాక్లెట్‌తో డెకరేట్ చేశాడు. అయితే ఇప్పటి వరకూ దోస, ఉల్లి దోస, మసాలా దోస వంటి అనేకరకాల దోసలను తిని ఉంటారు.

Viral Video: చాక్లెట్ దోసెను వేస్తున్న వ్యక్తి.. మమ్మల్ని ఫుడ్ తిననివ్వండి అంటూ నెటిజన్లు ఫైర్
Viral Video Kit Kat Dosa
Follow us on

మనదేశంలో అనేక సాంప్రదాయాలు.. భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. నార్త్ ఇండియన్స్ ఒక విధమైన ఆహారం ఉంటే .. దక్షిణ భారత దేశంలోని ఆహారం భిన్నమైన టేస్ట్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు మసాలా దోస, ఇడ్లీ సాంబార్ వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. నార్త్ ఇండియన్స్ చపాతీ, పూరీ వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు సరిహద్దులు చెరిగిపోయాయి.. ఒక ప్రాంతపు ఆహారాన్ని.. మరొక ప్రాంతం వారు తినడం ప్రారంభించారు.  కొందరు వాటితో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక వింతైన టిఫిన్ కు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆహారపు ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి టిఫిన్ సెంటర్ లో చాక్లెట్ దోసెను తయారు చేస్తున్నాడు. కిట్ క్యాట్ తో దోసె తయారు చేయడమే కాదు.. దోస రెడీ అయిన తర్వాత పైన చీజ్ ను తర్వాత కిట్-క్యాట్ చాక్లెట్‌తో డెకరేట్ చేశాడు. అయితే ఇప్పటి వరకూ దోస, ఉల్లి దోస, మసాలా దోస వంటి అనేకరకాల దోసలను తిని ఉంటారు. అయితే ఇలా చాక్లెట్ దోస తయారీ అనేది బహుశా ఊహకు కూడా అందరి టిఫిన్. ఈ వింత వంటకం ప్రజలను ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి

ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. ఇది thegreatindianfoodie అనే IDతో షేర్ చేసిన వీడియో ఇప్పటివరకు 2.8 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 36 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఒకరు ఇలాంటి ఆహారాన్ని తయారు చేసే ఫుడ్ సెంటర్స్ లైసెన్స్ రద్దు చేయమని అంటుంటే.. ఇది చూసిన తర్వాత దోస తినాలనే ఫీలింగ్ పోయిందని మరొకరు కామెంట్ చేస్తే.. సోదరా.. ఇక పేడతో దోసను,   గుట్కా దోసలను కూడా తయారు చేయడం మొదలు పెట్టండి అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..