Viral Video: సింహాలకు సుస్సుపోయించిన అడవి దున్న.. ఇది కదా హీరోయిజం అంటే.. వీడియో చూస్తే

అటవీ ప్రపంచం ఎప్పుడూ రిస్క్‌తో కూడుకున్నది. చిన్న జంతువులు బ్రతకాలంటే.. పెద్ద జంతువుల నుంచి తప్పించుకుంటూ జీవనం సాగించాల్సిందే. అడవికి రారాజు సింహం. ఒకరు సింహానికి ఎదురెళ్లినా వాడికే రిస్క్.. సింహానికి ఒకరెదురెళ్లినా వాడికే రిస్క్. అవును మరి.!

Viral Video: సింహాలకు సుస్సుపోయించిన అడవి దున్న.. ఇది కదా హీరోయిజం అంటే.. వీడియో చూస్తే
Viral Video
Follow us

|

Updated on: Sep 06, 2024 | 10:45 AM

అటవీ ప్రపంచం ఎప్పుడూ రిస్క్‌తో కూడుకున్నది. చిన్న జంతువులు బ్రతకాలంటే.. పెద్ద జంతువుల నుంచి తప్పించుకుంటూ జీవనం సాగించాల్సిందే. అడవికి రారాజు సింహం. ఒకరు సింహానికి ఎదురెళ్లినా వాడికే రిస్క్.. సింహానికి ఒకరెదురెళ్లినా వాడికే రిస్క్. అవును మరి.! సింహం కంటపడితే.. ఏ జంతువుకైనా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అయితే అప్పుడప్పుడూ అడవికి రాజైన సింహానికి కూడా షాకులు తగులుతాయి. అడవి దున్నలు, దున్నపోతులు, గేదెలు లాంటివి సింహానికి జలక్ ఇస్తాయి. తాజాగా సింహాల వేటకు సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అడవి దున్నను ఓ సింహాల గుంపుకు చిక్కింది. తీరా అవి దాడి చేసే సమయానికి.. ఏం జరిగిందో తెలిస్తే..

వైరల్ వీడియో ప్రకారం.. ఆహారం కోసం వెతుకుతున్న కొన్ని సింహాలకు.. అటుగా వెళ్తున్న ఓ పెద్ద అడవి దున్న కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా దాన్ని సింహాలన్ని చుట్టుముడుతాయి. ఇక ఆ సింహాలు తనను ఎటాక్ చేస్తాయని అలెర్ట్ అయిన అడవి దున్న.. ఒక్కసారిగా పరుగులు పెట్టింది. సింహాలు పట్టుకునేందుకు పంజా విసిరినా.. దాన్ని తప్పించుకుని ఒక్కసారిగా గాల్లోకి జంప్ చేసింది. వాటికి దొరక్కకుండా ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది. నీటిలోకి దూకి పరుగుపెట్టి.. కళ్లు మూసి తెరిచేలోపు అక్కడ నుంచి పారిపోతుంది. దీంతో సింహాలన్నింటికి చివరికి చావుదెబ్బ తగిలింది.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఒలింపిక్స్‌కి పంపితే.. అడవి దున్నకు గోల్డ్ మెడల్కన్ఫర్మ్ అంటూ’ ఒకరు కామెంట్ చేస్తే.. ‘వామ్మో.! అడవి దున్న వేగం మాములుగా లేదుగా’ అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.