Viral Video: ట్రక్ వెనుక నుంచి వింత శబ్దాలు.. టార్పాలిన్ తీసి చూడగా గుండె గుభేల్!

|

Aug 16, 2022 | 3:31 PM

పాములు భయానకంగా.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉంటాయి. ఇక్కడ కూడా పాములు దాక్కుంటాయా.?

Viral Video: ట్రక్ వెనుక నుంచి వింత శబ్దాలు.. టార్పాలిన్ తీసి చూడగా గుండె గుభేల్!
Representative Image
Follow us on

పాములను దూరం నుంచి చూస్తే చాలు.. జనాలు దెబ్బకు దడుసుకుంటారు. అలాంటిది ఓ భారీ పాము మన దగ్గరగా వస్తే.. ఇంకేమైనా ఉందా.? గుండె జారి గల్లంతయ్యిపోతది. ఎందుకంటే పాములు భయానకంగా.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉంటాయి. ఇక్కడ కూడా పాములు దాక్కుంటాయా.? అని ఆశ్చర్యపోయేలా పలు ప్రదేశాల్లో పాములను గుర్తించిన సందర్భాలను మనం ఎన్నో చూసి ఉంటాయి. మేము ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే.

వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కు చెందిన సూరత్ థానీ అనే వ్యక్తి పని ముగించుకుని.. తన ట్రక్‌లో తిరిగి ఇంటికి వస్తున్నాడు. మధ్య దారిలో అతడికి ట్రక్ వెనుక భాగం నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించాడు. నైట్ టైం కావడంతో అతడు.. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇంటికి చేరుకొని.. ట్రక్ పార్క్ చేస్తుండగా.. ఆ శబ్దాలు పెద్దగా రావడం మొదలయ్యాయి. ఇక లాభం లేదనుకున్న అతడు.. ఏమై ఉంటుందని వెనుక ఉన్న టార్పాలిన్ తీసి చూడగా.. 12 అడుగుల భారీ నాగుపాము కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించడంతో.. ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అడవిలో వదిలిపెట్టారు.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్పటిదాకా దీనికి 10 వేలకు పైగా లైకులు వచ్చాయి. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..