Car – Bike Stunt: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంతమంది పలు స్టంట్లు చేస్తుంటారు.. ప్రమాదకర విన్యాసాలను సైతం చేస్తూ.. ఇతరుల జీవితాన్ని సైతం ఇబ్బందుల్లో పడేస్తుంటారు. అలాంటి ఓ ప్రమాదకర స్టంట్ చేసిన ఓ యువకుడిని పట్టుకొని పోలీసులు ఊచలు లెక్కబెట్టేలా చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన గౌతమ్ బుద్ధ్‌నగర్‌కు చెందిన యువకుడిని నోయిడా (Noida) పోలీసులు అరెస్టు చేశారు. నోయిడా ప్రాంతానికి చెందిన రాజీవ్ (21) సోషల్ మీడియాలో వైరల్ కావాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతను రెండు SUV కార్లపై అదేవిధంగా.. మోటార్‌సైకిల్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు. అయితే.. వైరల్ అయిన ఈ వీడియోలను చూసిన పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
షేర్ అయిన ఒక వీడియోలో రాజీవ్.. ఫూల్ ఔర్ కాంటే (1991) చిత్రంలో నటుడు అజయ్ దేవగన్ (Ajay Devgn )చేసిన స్టంట్‌ను చేశాడు. దీనిలో రాజీవ్ రెండు కార్లపై రెండు కాళ్లను ఉంచి హీరోలా నిలబడి.. స్టంట్ చేశాడు. అదేవిధంగా రద్దీగా ఉండే రోడ్డుపై బైక్‌పై వెళుతూ స్టంట్ చేశాడు. అలా చేయడం వల్ల తన ప్రాణాలే కాదు, రోడ్డుపై ఉన్న ఇతరుల ప్రాణాలనూ పణంగా పెట్టాడని పోలీసులు తెలిపారు.
వీడియోల ఆధారంగా రాజీవ్‌ను సొరఖా గ్రామానికి చెందిన గుర్తించి అరెస్టు చేసినట్లు నోయిడా సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ శరద్ కాంత్ తెలిపారు. స్టంట్ల కోసం ఉపయోగించిన రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. టొయోటా ఫార్చ్యూనర్‌లలో ఒకటి రాజీవ్ బంధువులకు సంబంధించినదని.. మోటార్‌సైకిల్, మరో కారు రాజీవ్ కుటుంబానికి చెందినవని తెలిపారు.
వైరల్ వీడియో..
गाड़ियों व बाइक पर खतरनाक स्टंट करने वाले युवक को थाना सेक्टर-113 नोएडा पुलिस द्वारा गिरफ्तार कर स्टंट में प्रयुक्त वाहनों को सीज किया गया।#UPPolice pic.twitter.com/92yYu33O45
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 22, 2022
రాజీవ్ బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడని.. ఉద్యోగం లేదని తెలిపారు. ఈ క్రమంలో అతను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వీడియోలు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..