రోజంతా కష్టపడితేనే రూ. 1000 సంపాదించడం కష్టం. అలాంటిది కొన్ని గంటల వ్యవధిలోనే.. అది కూడా జస్ట్ ఒక బల్బ్ మార్చడం ద్వారా 20,000 డాలర్లు సంపాదిస్తున్నాడు ఓ వ్యక్తి. అది కూడా రెగ్యూలర్ వర్క్ ఏం కాదండోయ్. కేవలం 6 నెలలకు ఒకసారి మాత్రమే బల్బ్ మార్చాలి. మార్చిన ప్రతిసారి 20వేల డాలర్ల జీతం అతను పొందుతాడు. అవును మీరు విన్నది నిజంగా నిజమే. జస్ట్ బల్బ్ మారిస్తే 20 వేల డాలర్ల జీతమా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, దాని వెనుక ఉన్న రిస్క్ ఏంటో కూడా తెలుసుకోవాల్సిందే.
మనం 10 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ ఎక్కి కిందకు చూస్తేనే జడుసుకుని చస్తాం. అలాంటిది ఏకంగా.. ఆకాశమంత ఎత్తున, సన్నటి టవర్ ఎక్కమంటే ఎవరైనా ముందుకొస్తారా? ఛాన్సే లేదు. దాన్ని ఎక్కడం అటుంచితే.. చూడగానే కల్లు తిరిగి పడిపోవడం ఖాయం. అవును, ఆ టవర్ చూడటానికి ఆకాశమంత ఎత్తు, సన్నగా ఉంటుంది. దాని చివరన ఉన్న బల్బ్‌ను ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. అదే పనిని ఓ వ్యక్తి చేస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన పని కాబట్టే అతనికి ఒకసారి బల్బ్ మార్చినందుకు 20 వేల డాలర్లు చెల్లిస్తోంది సదరు కమ్యూనికేషన్ టవర్ యాజమాన్యం.
సౌత్ డకోటాలోని సేలం ప్రాంతంలో KDLT-TV అనలాగ్ టవర్ ఉంది. ఈ టవర్ ఎత్తు 1500 అడుగులు. దీని చివరన ఒక బల్బ్ ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ బల్బ్‌ని మార్చాల్సి ఉంటుంది. దీన్ని మార్చేందు ఎవరూ ముందుకు రాలేదు. కానీ, ఒక్కడు ఒకే ఒక్కడు ముందుకు వచ్చాడు. అతనే కెవిన్ స్మిత్. లైట్ బల్బ్ మార్చడానికి అతను ఏకంగా 1500 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కేందుకు ముందుకొచ్చాడు. ఇసుమంతైనా భయపడకుండా.. అలవోకగా, తక్కువ వ్యవధిలోనే పైకి ఎక్కి పని పూర్తి చేసుకుని వస్తాడు. అయితే, స్మిత్ ఇంత పెద్ద టవర్ ఎక్కి, దిగడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. చాలా గుండె ధైర్యం ఉంది బ్రో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ స్టన్నింగ్ స్టంట్‌కు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.
Every six months this man in South Dakota climbs this communication tower to change the light bulb. He is paid $20,000 per climb. pic.twitter.com/z9xmGqyUDd
— Historic Vids (@historyinmemes) December 2, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..