టోక్యో, జులై 31: ఎవరైనా చక్రవర్తిలా బతకాలని, ప్రపంచాన్ని ఏలాలని కలలు గంటారు. ఇలాంటి కలలు ఎవరైనా కంటారు. కానీ ఓ ప్రబుద్ధులు మాత్రం అందుకు విరుద్ధంగా కుక్క బతుకు బతకాలని కలలు కన్నాడు. అంతటితో ఆగకుండా ఎప్పటికైనా కుక్కలా మారాలనే తన కలను పట్టుబట్టి మరీ నెరవేర్చుకున్నాడో జపనీస్ వ్యక్తి. ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు చేసి చివరికి కుక్కలా మారిపోయాడు. ఐతే అతను ఎలాంటి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోలేదు. మరైతే ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఏం చేశాడో మీరే చదవండి..
టోకో అనే యూట్యూబర్ గురించే మనం మాట్లుడుకుంటోంది. కుక్కలా మారాలనే తన కలను నెరవేర్చుకోవడానికి రియలిస్టిక్ కాస్ట్యూమ్‌ను కొనుగోలు చేశాడు. అది ధరించని తర్వాత అచ్చం కోలీస్ జాతికి చెందిన కుక్కలా కనిపించాడు. జెప్పెట్ అనే కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ కాస్ట్యూమ్ తయారీకి దాదాపు 40 రోజులు పట్టిందట. ఇది ధరిస్తే నాలుగు కాళ్లపై నడుస్తున్న నిజమైన కుక్కలా కనిపిస్తారు. ఇక టోకో ఈ కాస్ట్యూమ్ ధరించి పార్కులో ఆడుకొంటున్న వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేశాడు.
అంతే.. ఆ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. తాజాగా అతను కుక్క కాస్ట్యూమ్ ధరించి మొదటిసారిగా జనాల్లో బహిరంగంగా నడుస్తోన్న మరో వీడియోను అప్‌లోడ్ చేశాడు. మిలియన్ల కొద్దీ వీక్షణలు రావడంతో ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో టోకో చూడటానికి అచ్చం బొచ్చు కుక్కలా కనిపించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు టోకోను ప్రశంసించగా.. మరికొందరేమో ఛీ.. ఇదేం పైత్యం అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.