Elephant Attack: ఉత్సవంలో రెచ్చిపోయిన గజరాజు బీభత్సం… మరో ఏనుగుతో భీకర యుద్ధం.. వీడియో చూస్తే వణుకే..
అందంగా అలంకరించబడిన ఏనుగులు కూడా ఉత్సవంలో ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక ఏనుగు ఎందుకో తెలియదు గానీ, పరిగెత్తటం ప్రారంభించింది. క్షణాల్లో అది సమీపంలోని మరొక ఏనుగు వైపు దూసుకుపోయి బలంగా ఢీ కొట్టింది. ఆత్మరక్షణ కోసం అవతలి ఏనుడు కూడా ప్రతి దాడిని కొనసాగిస్తుంది. రెండు ఏనుగుల మధ్య ఈ హింసాత్మక కొట్లాటతో అక్కడి స్థానికులు, భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించింది.
కేరళలో జరిగిన భయానక సంఘటనలో రెండు ఏనుగులు హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డాయి. మార్చి 22 శుక్రవారం రోజున ఆరట్టుపుజ ఆలయంలో గందరగోళం ఏర్పడింది. ఉత్సవంలో పాల్గొన్న రెండు ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. ఉత్సవానికి హాజరైన ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయాయి. ఎట్టకేలకు మావటి జోక్యంతో ఏనుగుల యుద్ధం సద్దుమణిగింది. రెండు భారీ ఏనుగుల భీకర యుద్ధంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలయ ఉత్సవ వేడుక కాస్త రణరంగాన్ని తలపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మలయాళం Xలో షేర్ చేసిన ఓ వైరల్ వీడియోలో ఆరాట్ ఆచారం కోసం ఆరట్టుపుజ ఆలయంలో ఉత్సవం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో అందంగా అలంకరించబడిన ఏనుగులు కూడా ఉత్సవంలో ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక ఏనుగు ఎందుకో తెలియదు గానీ, పరిగెత్తటం ప్రారంభించింది. క్షణాల్లో అది సమీపంలోని మరొక ఏనుగు వైపు దూసుకుపోయి బలంగా ఢీ కొట్టింది. ఆత్మరక్షణ కోసం అవతలి ఏనుడు కూడా ప్రతి దాడిని కొనసాగిస్తుంది. రెండు ఏనుగుల మధ్య ఈ హింసాత్మక కొట్లాటతో అక్కడి స్థానికులు, భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించింది. అంతలోనే ఏనుగుల సంరక్షకులు, మావటిలు పరిగెత్తుకుంటూ వచ్చారు..ఆగ్రహంతో ఊగిపోతున్న రెండు ఏనుగులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
An elephant which was brought for the arat ritual at Mandarakadavu in connection with the Arattupuzha pooram, attacked a fellow elephant. pic.twitter.com/0mlgjhSM3T
— The Hindu (@the_hindu) March 23, 2024
హింసాత్మక ఏనుగులను మచ్చిక చేసుకునేందుకు ఏకంగా ఏనుగు సంరక్షకులు బృందమే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎట్టకేలకు ఏనుగులు శాంతించాయి. అనంతరం వాటిని అక్కడి నుండి తరలించారు మావటిలు. దీంతో అక్కడి యుద్ధ వాతావరణం చల్లబడింది. భయంతో వణికిపోయిన ప్రజలు గందరగోళం, భయం నుంచి కాస్త ఉపశమనం పొందారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..