న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఓ ప్రయాణికుడు ఉన్నట్టుండి కుప్పకూలాడు. అక్కడే ఉన్న CISF సిబ్బంది వెంటనే అతనికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేసి, అతడి ప్రాణాలు రక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.య అసలేం జరిగిందంటే.. ఈ వీడియోలో అర్షిద్ అయూబ్ అనే ఓ ప్యాసింజర్ ఎయిర్ పోర్టులో నిలబడి ఉండటం చూడొచ్చు. ఎయిర్ పోర్టులోని ర్మినల్-2 ద్వారా శ్రీనగర్ వెళ్తేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ అంతలో అర్షిద్ అయూబ్ హఠాత్తుగా కుప్పుకూలిపోవడం వీడియోలో చూడొచ్చు. దీంతో అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్ క్షణాల వ్యవధిలో అతడికి సీపీఆర్ చేశారు.
అనంతరం అర్షిద్‌కు సృహరావడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆగస్ట్ 20న ఉదయం 11 గంటలకు విమానాశ్రయం టెర్మినల్ 2 ముందుభాగంలో జరిగిందని, ఇండిగో విమానంలో శ్రీనగర్ వెళ్లాల్సిన ప్రయాణికుడు హ్యాండ్ ట్రాలీ స్టాండ్ దగ్గర కుప్పకూలాడని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తత, సత్వర చర్య కారణంగా ఒక విలువైన ప్రాణం రక్షించబడిందని ఆ అధికారి తెలిపారు. కాగా IGI ఎయిర్ పోర్టులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) టెర్రరిస్ట్ నిరోధక భద్రతను అందించడానికి పని చేస్తుంది.
#WATCH | A quick CPR (Cardiopulmonary resuscitation) to a passenger Arshid Ayoub by the Central Industrial Security Force’s quick reaction team played a crucial role in establising his condition. Ayoub, bound for Srinagar flight from Terminal 2 of the IGI Airport on Tuesday… pic.twitter.com/b21wZG78Oa
— ANI (@ANI) August 22, 2024
కాగా నేటి కాలంలో ప్రతి ఒక్కరూ గుండెపోటుకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నట్లుండి కుప్పకూలి పోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలా కుప్పకూలినప్పుడు సమీపంలోని వ్యక్తులు CPR చేసి వారికి తిరిగి ప్రాణాలు పోయొచ్చు. సీపీఆర్ అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు నిర్వహించబడే అత్యవసర ప్రాణాలను రక్షించే ప్రక్రియ. కుప్పకూలిన వ్యక్తి గుండెపై రెండు చేతులు ఉంచి బలంగా ఒత్తిడి చేయడం ద్వారా.. ఆగిపోయిన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభిస్తుంది.