Viral Video: ఇదెక్కడి పైత్యం.. రద్దీ రోడ్డులో కారు బానెట్‌పై పడుకుని ముసలోడి వెకిలీ వేషాలు! కట్‌ చేస్తే

|

May 27, 2024 | 6:49 PM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడానికి కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. యువతే అనుకుంటే ఈ జాబితాలో సీనియర్ సిటిజన్లు కూడా చేరుతున్నారు. తాజాగా ఓ తండ్రి తన టీనేజ్‌ కుమారుడితో కలిసి బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించి అందరితో చివాట్లు తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి కటకటాల వెనక వేశారు. ఇంతకీ వీడియోలో..

Viral Video: ఇదెక్కడి పైత్యం.. రద్దీ రోడ్డులో కారు బానెట్‌పై పడుకుని ముసలోడి వెకిలీ వేషాలు! కట్‌ చేస్తే
man lying on BMW bonnet
Follow us on

ముంబై, మే 27: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడానికి కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. యువతే అనుకుంటే ఈ జాబితాలో సీనియర్ సిటిజన్లు కూడా చేరుతున్నారు. తాజాగా ఓ తండ్రి తన టీనేజ్‌ కుమారుడితో కలిసి బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించి అందరితో చివాట్లు తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి కటకటాల వెనక వేశారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

ముంబైలో కళ్యాణ్‌లోని శివాజీ చౌక్ ప్రాంతంలో రద్దీగా ఉండే రోడ్లపై ఓ వ్యక్తి తన 17 ఏళ్ల కొడుకుతో బీఎండబ్ల్యూ కారు డ్రైవింగ్‌ చేయించాడు. కొడుకు కారు నడుపుతుంటే తండ్రి మాత్రం కారు ముందున్న బానెట్‌పై పడుకుని వెకిలీ వేషాలు వేస్తూ రీల్స్‌ చేస్తూ కనిపించాడు. రోడ్డుపై పాదచారులు, ఇతర వాహనదారులు ఇదెక్కడి చోద్యం అనుకుంటూ వింతగా చూడసాగారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియలో వైరల్ చేసేందుకు పోస్ట్‌ చేయడంతో.. కథ అడ్డం తిరిగి మొదటికే మోసం వచ్చింది. వీడియో చూసిన వారందరూ సదరు పెద్దమనిషి తీరును తప్పుపడుతూ చివాట్లు పెడుతున్నారు. వీడియోలో అతను కారు ముందు భాగంలో పడుకుని రైడ్‌ను ఆస్వాదిస్తూ స్టంట్‌ చేయడం కనిపిస్తుంది. ఇక వీడియో పోలీసుల కంట పడటంతో వెతుక్కుంటూ వచ్చి తండ్రీకొడుకులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అరెస్టైన వ్యక్తిని సుభమ్ మటాలియ గుర్తించారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇటీవల పూణేలోని ప్రముఖ బిల్డర్ కొడుకు (మైనర్‌) మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఓ వ్యక్తి మరణానికి కారణం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన 15 గంటల్లోనే బెయిల్‌ కూడా రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జువైనల్ జస్టిస్ బోర్డ్ (JJB) నిందితుడిని జూన్ 5 వరకు 14 రోజుల పాటు రిమాండ్ హోమ్‌కు తరలించింది. ఈ కేసులో మైనర్ తండ్రిని కూడా పోలీసు కస్టడీకి పంపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.