Viral Video: ఎగురుతున్న విమానం విండ్‌షీల్డ్‌లో ఇరుక్కుపోయిన పక్షి.. రక్తంతో స్నానం చేసిన పైలట్

ఆ తాకిడికి కాక్‌పిట్ విరిగిన విండ్‌షీల్డ్‌లో ఇరుక్కుపోయింది. పైలట్ ముఖం, అతని ఒళ్లంతా పక్షి శరీరం నుండి చిమ్మిన రక్తం ప్రవహించింది. కానీ, ఇక్కడ పైలట్ తన సంయమనం కోల్పోకుండా విమానాన్ని నడిపాడు. ఎటువంటి భయం, ఆందోళనకు గురికాకుండా విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానంలో దించాడు.

Viral Video: ఎగురుతున్న విమానం విండ్‌షీల్డ్‌లో ఇరుక్కుపోయిన పక్షి.. రక్తంతో స్నానం చేసిన పైలట్
Bird Caught In Windshield
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 17, 2023 | 11:20 AM

సోషల్ మీడియాలో షాకింగ్‌ వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఎగురుతున్న విమానం విండ్‌షీల్డ్‌కు పక్షులు తగలడం నిత్యకృత్యం. అయితే, ఇక్కడ అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. గాల్లో ఎగురుతున్న విమానం విండ్‌షీల్డ్‌లో ఒక భారీ పక్షి ఇరుక్కుపోయింది. దాని శరీరం నుంచి చిమ్మిన రక్తంతో పైలట్ స్నానం చేశాడు. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో చిక్కుకున్న పక్షి, పైలట్ ముఖం నిండా రక్తంతో విమానాన్ని నడుపుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించటంతో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

గాల్లో దూసుకెళ్తు్న విమానాన్ని పక్షి బలంగా ఢీకొట్టింది. ఆ తాకిడికి కాక్‌పిట్ విరిగిన విండ్‌షీల్డ్‌లో ఇరుక్కుపోయింది. పైలట్ ముఖం, అతని ఒళ్లంతా పక్షి శరీరం నుండి చిమ్మిన రక్తం ప్రవహించింది. కానీ, ఇక్కడ పైలట్ తన సంయమనం కోల్పోకుండా విమానాన్ని నడిపాడు. ఎటువంటి భయం, ఆందోళనకు గురికాకుండా విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానంలో దించాడు.

ఇవి కూడా చదవండి

వైరల్‌గా మారిన ఈ వీడియో క్లిప్‌కు ట్విట్టర్‌లో చాలా స్పందనలు వచ్చాయి. పైలట్‌ ఒక లెజెండ్.. అతని ప్రశాంతతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం  క్లిక్ చేయండి..