AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్యాంట్ జేబులోంచి ఒక్కసారిగా పొగలు.. క్షణాల్లో పేలిన స్మార్ట్‌ఫోన్.. ఇదిగో వీడియో!

మొబైల్ ఫోన్ అనేది ప్రస్తుతం మానవుడి జీవితంలో ఒక భాగమైపోయింది. ఫోన్ లేకుండా జనాలు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. ఈ మొబైల్ వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో.. అదే తరహాలో నష్టాలు కూడా లేకపోలేవు. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Viral Video: ప్యాంట్ జేబులోంచి ఒక్కసారిగా పొగలు.. క్షణాల్లో పేలిన స్మార్ట్‌ఫోన్.. ఇదిగో వీడియో!
Phone Explodes In Pocket
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 3:04 PM

Share

రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన జనాల్లో ఫోన్‌ వాడాలంటేనే భయం తెప్పిస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న మండోర్ వ్యవసాయ మార్కెట్‌లో ఒక వ్యాపారి జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. వ్యాపారి పని చేసుకుంటూ నిలబడి ఉండగా జేబులో ఉన్న ఫోన్ పేలిపోవడంతో.. అతని ప్యాంట్‌లోంచి ఒక్కసారిగా పొగ బయటకు వచ్చింది. అది క్షణాల్లోనే రూమ్‌ మొత్తం వ్యాపించింది.

పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన వ్యాపారి కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకొని అతన్ని దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు నిర్ధారించారు.

ఎక్కువ మంది చదివినవి: ఏసీ ఆన్‌ చేసిన వెంటనే ఏవో వింత శబ్ధాలు.. ఏంటని పైకి ఎక్కి చూడగా..

అయితే అతని ప్యాంట్‌లో ఫోన్ పేలిన దృశ్యాలు మొత్తం సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో చూసిన జనాలు షాక్ అయ్యారు. ఈ ఘటన తర్వాత చాలా మంది ఫోన్ వాడాలంటే భయంతో వణికిపోతున్నారు. అయితే తీవ్రమైన ఎండ వేడిమి వల్ల ఫోన్ అతిగా వేడెక్కడం.. లేదా బ్యాటరీలో ముందే ఉన్న సాంకేతిక లోపం వల్ల ఇది జరిగి ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వీడియో చూడండి.

ఫోన్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఫోన్‌ను నేరుగా ఎండలో పెట్టకూడదు.
  • వేడిగా ఉండే చోట ఫోన్ ఉంచకూడదు.
  • బ్యాటరీ ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే మార్చుకోవాలి.
  • ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి అస్సలు ఉపయోగించకూడదు.
  • రాత్రి పడుకునేప్పుడు ఫోన్‌ను దిండు కింద లేదా గాలి ఆడకుండా మూసి ఉన్న చోట పెట్టొద్దని సూచిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి:కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా అందాన్ని పెంచుకోండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us