Watch: చిరుతను వెంటాడిన పులి.. వాయువేగంతో పంజా విసిరింది.. క్లైమాక్స్‌లో ట్విస్ట్‌

సోషల్ మీడియాలో వీడియో మాత్రం దూసుకుపోతుంది. పులులు సైతం మ‌నుగ‌డ సాగించేందుకు స్లిమ్‌గా ఉండాల‌ని పులి తిరుగాడే ప్రాంతంలో చిరుత ఎలా త‌నను తాను

Watch: చిరుతను వెంటాడిన పులి.. వాయువేగంతో పంజా విసిరింది.. క్లైమాక్స్‌లో ట్విస్ట్‌
Leopard, Tiger
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 15, 2023 | 1:31 PM

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. తాజాగా ఒకే జాతికి చెందిన పులి, చిరుత పులికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో పులి బారి నుంచి త‌ప్పించుకున్న చిరుతపులి చాకచక్యం కనిపించింది. కానీ, క్లైమాక్స్‌లో ట్విస్ట్‌ మాత్రం ఊహించనిది. అయితే, పులి బారి నుంచి చిరుత తృటిలో త‌ప్పించుకున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 35,000 మందికి పైగా వీక్షించారు.

30 సెకండ్ల నిడివి క‌లిగిన ఈ వీడియోలో చిరుతను వెంటాడేందుకు పులి వేగంగా దూసుకురావ‌డం క‌నిపిస్తుంది. అయితే, చిరుత‌ను వాయువేగంతో పులి వెంబ‌డించ‌గా చిరుత అమాంతం చెట్టుపైకి ఎక్క‌డం క‌నిపిస్తుంది. ఆపై చిరుత‌ను వెంటాడుతూ చెట్టు కొంతభాగంపైకి ఎక్కిన పులి ఇక అంతకు మించి పైకి ఎక్కలేకపోతుంది. దాంతో ప్రయత్నం విరమించుకుంటుంది. ఇక లాభం లేదని భావించి వెనుతిరుగుతుంది. సోషల్ మీడియాలో వీడియో మాత్రం దూసుకుపోతుంది. పులులు సైతం మ‌నుగ‌డ సాగించేందుకు స్లిమ్‌గా ఉండాల‌ని పులి తిరుగాడే ప్రాంతంలో చిరుత ఎలా త‌నను తాను కాపాడుకుందో తెలుస్తోంద‌ని ఈ పోస్ట్‌కు సుశాంత్ నందా క్యాప్ష‌న్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక వీడియో షేర్‌ చేసిన సుశాంత్‌ నందా..పులులు సుల‌భంగా చెట్లు ఎక్క‌గ‌లుగుతాయ‌ని అయితే వ‌య‌సు పెరిగేకొద్దీ వాటి శ‌ర‌రీ బరువు చెట్లు ఎక్కేందుకు స‌హ‌క‌రించ‌వ‌ని చెప్పుకొచ్చారు. ఇకపోతే, తన‌ను వెంబ‌డిస్తున్న పులి నుంచి త‌ప్పించుకునేందుకు చిరుత వాయువేగంతో చెట్టుపైకి ఎక్క‌డం అద్భుత‌మ‌ని పలువురు యూజ‌ర్లు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!