Baldness: బట్టతల ఉందని ఉద్యోగిని తొలిగించారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు..

కొన్ని సార్లు మనకు నచ్చకున్నా.. మీరు చెప్పింది సూపర్ అంటుంటాం. ఎందుకంటే అతను మనకు బాస్.. కానీ ఓ బాస్ చేసిన టెంపర్మెంట్‌కు ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. అదేంటో ఇక్కడ చదువుదాం..

Baldness: బట్టతల ఉందని ఉద్యోగిని తొలిగించారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు..
Baldness
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 15, 2023 | 12:59 PM

బాస్ ఈజీ బాస్.. తాను చెప్పిందే జరగాలి. ఇలాంటి మొడివాదన చేసేవారిని మనం చాలా సార్లు చూసి ఉంటాం. ముఖ్యంగా మనం పని చేసే చోట బాస్ చెప్పేవి కొన్ని సార్లు మనకు చాలా ఆశ్చర్యాన్ని, తికమకను కలిగిస్తుంటాయి. కొన్ని సార్లు మనకు నచ్చకున్నా.. మీరు చెప్పింది సూపర్ అంటుంటాం. ఎందుకంటే అతను మనకు బాస్.. కానీ ఓ బాస్ చేసిన టెంపర్మెంట్‌కు ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల నుంచి చాలా సార్లు బాస్, ఉద్యోగులకు సంబంధించిన కేసులు సోషల్ మీడియాలో ఫన్నీగా చక్కర్లు కొడుతుంటాయి.. అంతేకాదు కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంటాయి. తనకు నచ్చలేదని ఉద్యోగం నుంచి తొలగించడం.. మరొకరికి ఉద్యోగం ఇప్పించడం చేస్తుంటారు.. అయితే తాజాగా ఇచ్చు ఇలాంటి వార్తే ఇప్పుడు పెద్ద చర్చకు కారణంగా మారింది. తన తలపై వెంట్రుకలు లేవని..  బట్టతల ఉన్నవారందరిని తొలిగించారు. ఓ బాస్ తన ఉద్యోగినిపై వేటు వేయడంతో చాలా ఇంట్రెస్టింగ్ కేసు తెరపైకి వచ్చింది.

“బట్టతల ఉన్నోడు అద‌ృష్టవంతుడు” అని మనం చిన్నప్పటి నుంచి ఈ సామెతను ఉంటుంటాం.. అయితే, ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి విషయంలో మాత్రం అచ్చంగా మరోలా జరిగింది. అదే బట్టతల అతనికి శాపంలా మారింది. బట్టతల ఉందన్న కారణంతో అతడిని ఉద్యోగంలో నుంచి పీకేశాడు అతని బాస్. ఉద్యోగం పోయిందని ఊరుకున్నాడా..?లేదండి బాబు.. తానేంటో చేసి చూపించాడు. బాస్ సంగతి చూశాడు. అసలేం జరిగిందంటే..

బట్టతల ఉందని ఉద్యోగిపై వేటు..

ఈ సంఘటన UKలోని లీడ్స్‌లో జరిగింది. బ్రిటీష్ మీడియా అందించిన కథనం ప్రకారం, బాస్ పేరు ఫిలిప్, ఉద్యోగి పేరు మార్క్‌ జోన్స్. ఫిలిప్ కంపెనీ పేరు టాంగో నెట్‌వర్క్‌. ఇది మొబైల్‌ ఫోన్ల సంస్థ. ఇందులో జోన్స్ సేల్స్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.

ఓ రోజు బాస్‌కు కోపం వచ్చింది. అయితే బట్టతల ఉందన్న కారణంతో జోన్స్‌‌ను ఉద్యోగంలో నుంచి తొలగించాడు. తన సేల్స్‌ టీమ్‌లో యువకులు, చురుకైనవారు మాత్రేమే ఉండాలని భావించిన ఆ బాస్‌.. 50ఏళ్లు దాటి బట్టతల ఉన్న ఉద్యోగులు తన బృందంలో ఉండకూదని ఆర్డర్ జారీ చేశాడు. బాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో జోన్స్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన జోన్స్ ఇదేం కారణం అంటూ న్యాయ పోరాటం మొదలు పెట్టాడు. సదరు మొబైల్‌ తయారీ కంపెనీపై కేసు వేశాడు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన లోకల్ కోర్టు.. జోన్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జోన్స్‌ను ఎలాంటి కారణం లేకుండా వివక్షపూరితంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని న్యాయస్థానం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆ కంపెనీపై భారీ ఫైన్ వేసింది. ఒకటి రెండు వేలు కాదు ఏకంగా 71వేల పౌండ్లు.. అంటే మన కరెన్సీల్లో దాదాపుగా రూ.71లక్షల నష్టపరిహారాన్ని ఆ ఉద్యోగికి చెల్లించాలని ఆదేశించింది కోర్టు. దీంతో ఆ మొత్తాన్ని కంపెనీ అతడికి చెల్లించాల్సి వచ్చింది.

అయితే.. జోన్స్‌ను తొలగించిన ఆ బాస్‌ ఫిలిప్‌కు కూడా బట్టతల ఉండటం విచిత్రం. ఇది పట్టించుకోకుండా బట్టతల ఉన్న ఉద్యోగిని తొలగించాడు. అయితే మరో వాదనను కూడా ఉంది. రెండేళ్లు అక్కడే జోన్స్ ఉంటే తనకు పూర్తిస్థాయి ఉద్యోగి హక్కులు వస్తాయనే ఉద్దేశపూర్వకంగానే తనను తొలగించారని మార్క్ చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం