Viral Video: అర్జున్ రెడ్డి సినిమాలోని సీన్‌ను లైవ్‌లో చూపిన డాక్టర్.. రోగిని పొట్టు పొట్టుగా కొట్టిన వీడియో వైరల్
Viral Video: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని డాక్టర్, సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డరర్‌తో సమానం. అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాలోని ఈ డైలాగ్‌ను రియల్ లైఫ్‌లో చేసి చూపించాడు ఓ వైద్యుడు. కడుపు నొప్పితో వచ్చిన ఓ రోగిని కర్రతో..
Viral Video: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని డాక్టర్, సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డరర్‌తో సమానం. అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాలోని ఈ డైలాగ్‌ను రియల్ లైఫ్‌లో చేసి చూపించాడు ఓ వైద్యుడు. కడుపు నొప్పితో వచ్చిన ఓ రోగిని కర్రతో చితకబాదాడు ఓ డాక్టర్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అయ్యింది. ఒడిశా (Odisha) లోని కలహండిలో ముఖేష్ నాయక్ అనే వ్యక్తికి కడుపు నొప్పి వచ్చింది. అతడు దగ్గర్లోని ధర్మఘర్ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ, అక్కడ డాక్టర్లు ఎవరూ లేరు. నర్సులే వచ్చి అతడిని బెడ్ మీద పడుకోబెట్టి ఇంజెక్షన్ చేశారు. కడుపునొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో డాక్టర్లు ఎందుకు లేరని ప్రశ్నించాడు ముఖేష్.
కొద్దిసేపటికి ముఖేష్ దగ్గరకు వచ్చిన డాక్టర్ సైలేష్ కుమార్, కర్ర అందుకొని అతడిపై దాడికి దిగాడు. పేషెంట్ అనే కనికరం కూడా లేకుండా పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఫైటింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసినవారంతా, డాక్టర్ సైలేష్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
#Inhuman… Doctor loosing his patience.
Dr. Sailesh Kumar Dora thrashed patient inside hospital in Odisha’s Kalahandi. A doctor allegedly thrashed a patient at the Dharmagarh sub-divisional hospital last evening. @ICMRDELHI@HealthOdisha @nabadasjsg @MoSarkar5T pic.twitter.com/2EZjMkdrxf
— Manas Behera @ANI (@manasbehera07) March 14, 2022
Also Read:
Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే
Assam Police: అసోంలో అక్రమంగా డ్రగ్స్ రవాణా.. ఇద్దరు అరెస్ట్.. రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
Andhra Pradesh: ఏపీలో ఆగని సారాయి రచ్చ ..నాటుసారా కేంద్రాలపై ఎస్‌ఈబీ అధికారుల ఉక్కుపాదం