
దేశంలో హార్ట్ ఎటాక్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. జిమ్ వర్కౌట్‌ల సమయంలో గుండెపోటు రావటంతో చాలా మంది అక్కడికక్కడే కుప్పకూలిన మృతిచెందిన ఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
జబల్పూర్‌లో జరిగిన ఈ షాకింగ్ సంఘటన మరోసారి జిమ్ వర్కౌట్‌ల సమయంలో గుండెపోటు కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని గోరఖ్‌పూర్ ప్రాంతంలోని జిమ్‌లో వ్యాయామం చేస్తూ 52 ఏళ్ల వ్యక్తి కుప్పకూలి మరణించాడు.
వీడియో ఇక్కడ చూడండి..
52-year-old man died of a heart attack while working out at a gym in Jabalpur#Jabalpurnews pic.twitter.com/7DJ74SIENV
— Free Press Madhya Pradesh (@FreePressMP) April 18, 2025
మృతుడిని యతీష్ సింఘైగా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన గోల్డ్స్ జిమ్‌కు అతను రెగ్యులర్‌గా వస్తుంటాడు. సంఘటన జరిగిన రోజు కూడా యతీష్ ఉదయం 6:45 గంటల ప్రాంతంలో జిమ్‌కు చేరుకున్నాడు. వివిధ జిమ్ మెషీన్‌లను ఉపయోగించి ఎప్పటిలాగే తన వ్యాయామం ప్రారంభించాడు. అయితే, సెషన్ సమయంలో అతను అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటు రావడంతో చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.
ఇలాంటి కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు లేదా అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు కఠినమైన శారీరక వ్యాయామాలు వంటివి చేసేందుకు ముందుగా పూర్తి శరీర పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు పదే పదే సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..