మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదని అంటారు. దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. భూమి ఆకాశంలో ఎక్కడైనా, ఏదైనా సాధించ గల సత్తా మనిషి సొంతం..అలాంటి ఘటనే ఒకటి కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. జీవితంపై నిరాశకు లోనైన వారందరికీ ఈ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టిన ఓ మహిళ ఇప్పుడు కారు నడుపుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు.. ఆసియాలోనే ఇలాంటి సాహసం చేసిన తొలి మహిళగా గుర్తింపుతో ఆమె అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి సాహోసోపేతమైన సంఘటన కేరళలో వెలుగు చూసింది. ఈ మేరకు కేరళకు చెందిన మోటారు వాహన విభాగం తెలిపింది. వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన మహిళ పేరు జిలుమోల్ థామస్.. ఆమె వయస్సు 32 సంవత్సరాలు. ఆమె ఫ్రీలాన్స్ డిజైనర్. పుట్టుకతోనే ఆమెకు రెండు చేతులు లేవు. ఇది చూసిన తల్లిదండ్రులు, ఇంట్లోని వారు చాలా బాధపడ్డారు. ఆమె జీవితం ఎలా సాగుతుందోనని అందరూ ఆందోళన చెందారు. కానీ, ఆ మహిళ ఆందోళనను విచ్ఛినం చేసింది. అంతేకాదు.. ప్రశంసించలేని అద్భుతం చేసింది.
జిలుమోల్ థామస్ నాలుగు చక్రాల వాహనానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. కాళ్లతో కారు నడపడం ఆమె కల. లైసెన్స్ పొందాలంటే ఇంటింటికీ పరుగులు తీయాల్సి వచ్చింది. మొన్నటికి మొన్న కొంతమంది నవ్వుతూనే ఉన్నారు, కానీ నేడు నవ్వేవారి నోళ్ళు ఆగాయి. తన కలను నెరవేర్చుకోవడానికి 6 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు. డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా మహిళకు అందజేశారు.
👇video made my day 🙏 Jilumol Mariot Thomas from Idukki, Kerala is the first lady in Asia without both upper arms to get driving licence with a special Court order. Awesome and highly inspiring. Salute her for the great will, determination and hardwork.
👌👍👏🙏 @NanhiKali pic.twitter.com/6ccephOH52— Manoj Kumar (@manoj_naandi) May 31, 2020
ఆసియాలోనే తొలి మహిళ
దీనిపై ఆ మహిళ మాట్లాడుతూ.. తాను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నానని చెప్పారు. డ్రైవింగ్ స్కూల్‌లో చేరినప్పుడు అందరూ ఎగతాళి చేశారని, చేతులు లేకుండా డ్రైవింగ్ అనేది నిజంగా సాధ్యంకాదని అందరూ అడ్డుకున్నారని చెప్పింది. కానీ, అన్ని అడ్డంకులను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని చెప్పింది. దీనిపై కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ మాట్లాడుతూ.. ఆసియాలోనే చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా ఆమె నిలిచింది. ఆమె తన కాళ్లను ఉపయోగించి, వాయిస్ కమాండ్ సిస్టమ్ ద్వారా కారును నడుపుతుందని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..