ఓ మహిళ తన భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అయితే కంగారులో తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకెళ్లడం మర్చిపోయింది. ఇక కండోమ్స్ కోసం దగ్గరలోని మెడికల్ స్టోర్‌కు వెళ్లింది. షాప్‌లోని కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తిని కండోమ్స్ కావాలని అడిగింది. దానికి అక్కడున్న వ్యక్తి ఇచ్చిన రియాక్షన్‌కు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఇంతకీ అసలు కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన జెస్సికా అనే మహిళ తన భర్తతో కలిసి విస్కాన్సిన్‌కు వెకేషన్ కోసం వెళ్లింది. తనతో పాటు గర్భనిరోధక మాత్రలు తెచ్చుకోకపోవడంతో.. దగ్గరలో ఉన్న వాల్‌గ్రీన్స్ స్టోర్‌కు కండోమ్స్ కొనేందుకు వెళ్లింది. అయితే ఆ షాప్‌లో ఉన్న వ్యక్తి జెస్సికాకు కండోమ్స్ అమ్మేందుకు నిరాకరించాడు. ‘మేము కండోమ్స్ మీకు అమ్మవచ్చు. కాని నా మత విశ్వాసం కారణంగా వాటిని అమ్మలేను’ అని అక్కడున్న వ్యక్తి జెస్సికాకు చెప్పాడు. దీనితో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆమె.. అతడితో గొడవకు దిగింది. అయితే అక్కడ గుమిగూడిన వారిలో ఎక్కువ మంది మగవారు ఉండటంతో జెస్సికా సైలెంట్ అయింది.
ఇక కొద్దిసేపటికి స్టోర్ మేనేజర్.. ఆ గుమస్తాను అక్కడ నుంచి పంపించేస్తాడు. అనంతరం ఆమెకు కండోమ్స్ విక్రయిస్తాడు. ‘తమ కంపెనీ పాలసీ ప్రకారం.. ఉద్యోగులకు అభ్యంతరం అనిపించేవి తిరస్కరించడానికి అనుమతి ఉందని.. మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి’ అని పేర్కొంటాడు. కాగా, తనకు కలిగిన ఈ అనుభవాన్ని జెస్సికా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటుంది.(Source)