Vultures Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. రాబందులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా పక్షుల్లో అత్యంత తెలివైనవి.. ప్రమాదకరనమైని రాబందులు. ఎందుకంటే ఇవి ఎంతో ఎత్తునుంచే.. గాలిలో విహరిస్తూ తమ ఎరను ఎంచుకుంటాయి. గాలిలో తెలియాడుతూ వచ్చి భూమిపైనున్న చిన్న జంతువులు, పాములు, చేపలు, కొళ్లు లాంటి వాటిని వేటాడటంతోపాటు కళేబరాలను తింటూ జీవిస్తాయి. అయితే.. గత దశాబ్దంలో రాబందుల సంఖ్య 90 శాతానికి పైగా తగ్గిందని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. వేట వల్ల వాటి సంఖ్య తగ్గిందని.. విషపూరితమైన కళేబరాలు తినడంతో అంతరిస్తున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. తాజాగా.. రాబందులకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూస్తుంటే వాటి మీటింగ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
రోడ్డు పక్కన రాబందుల గుంపు గుమిగూడి ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. విటిని చూస్తుంటే..? రాబందులన్నీ ఏదో అత్యవసర సమావేశం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ లో అన్ని ఒకటోట చేరి వేటకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఫన్నీ వీడియోను చూడండి.
వైరల్ వీడియో..
ज़रूर किसी गंभीर विषय पर आपात बैठक बुलाई गई है ? pic.twitter.com/75VqGYzktu
— Dipanshu Kabra (@ipskabra) March 23, 2022
ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఏదో తీవ్రమైన విషయాలపై అత్యవసర సమావేశం జరుగుతుందంటూ క్యాప్షన్ రాశారు. కేవలం 9 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 15 వేలకు పైగా వీక్షించగా, 1100 మందికి పైగా లైక్ చేశారు. దీంతోపాటు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: