AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవులకు వీఆర్ హెడ్ సెట్లు.. భలే ప్రయోగం !

రష్యాకు వెళ్తే అక్కడి ఆవుల్ని మనం వింతగా చూడక తప్పదు. మరేం లేదు.. వాటి కళ్ళకు (ముఖానికి అందామా ) వీఆర్ (వర్చ్యువల్ రియాల్టీ) హెడ్ సెట్లు కనిపించి కంగారు పడతాం.. అయితే అక్కడి రైతులకు ఇదేమీ వింత కాదట.. ఆవుల మందలో ఉండే వీటికి ఈ హెడ్ సెట్స్ ను అమరిస్తే.. వాటి ‘ యాంగ్జయిటీ ‘ , ‘ ఎమోషనల్ మూడ్ ‘ తగ్గి… పాలు ఎక్కువగా ఇస్తాయని వారు నమ్ముతున్నారు. మాస్కో సమీపంలోని […]

ఆవులకు వీఆర్ హెడ్ సెట్లు.. భలే ప్రయోగం !
Anil kumar poka
|

Updated on: Nov 27, 2019 | 2:19 PM

Share

రష్యాకు వెళ్తే అక్కడి ఆవుల్ని మనం వింతగా చూడక తప్పదు. మరేం లేదు.. వాటి కళ్ళకు (ముఖానికి అందామా ) వీఆర్ (వర్చ్యువల్ రియాల్టీ) హెడ్ సెట్లు కనిపించి కంగారు పడతాం.. అయితే అక్కడి రైతులకు ఇదేమీ వింత కాదట.. ఆవుల మందలో ఉండే వీటికి ఈ హెడ్ సెట్స్ ను అమరిస్తే.. వాటి ‘ యాంగ్జయిటీ ‘ , ‘ ఎమోషనల్ మూడ్ ‘ తగ్గి… పాలు ఎక్కువగా ఇస్తాయని వారు నమ్ముతున్నారు. మాస్కో సమీపంలోని క్రాస్నోగొర్క్ పాడి పరిశ్రమకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలోని రైతులు.. డెవలపర్లు, కన్సల్టెంట్లను అప్రోచ్ అయి.. ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాతావరణ పరిస్థితులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ఇలాంటి ప్రయోగాలవల్ల వాటి పాల దిగుబడి పెరుగుతుందని డచ్, స్కాటిష్ పరిశోధకుల స్టడీలో తేలిందట. రష్యా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇదే విషయాన్ని చెబుతోంది. పశువుల ‘ ఎమోషనల్ మూడ్ ‘ ని తమకు అనువుగా మార్చుకునేందుకు రైతులు రోబోటిక్స్ పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని ఈ శాఖ పేర్కొంది. అమెరికాలో వీటి మాసేజ్ కోసం ఆటోమేటెడ్ రొటేటింగ్ బ్రష్ లను వాడుతున్నారు. ఇక రష్యాలోనే మరికొందరు తమ పశుసంపద ఆరోగ్యంగా, ‘ రిలాక్స్ ‘ గా ఉండేందుకు ‘ క్లాసికల్ మ్యూజిక్ ‘ కూడా వాటికి వినిపిస్తున్నారు. మరి.. కొత్తగా చేబట్టిన ‘ వీఆర్ టెక్నాలజీ ‘ కారణంగా రష్యన్ ఆవులు ‘ క్షీర విప్లవానికి ‘ తెర తీస్తాయా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇక ఆవులకు ఈ టెక్నాలజీలో మన తెలుగు సినిమాలు చూపిస్తే పాల దిగుబడి ఇబ్బడి ముబ్బడి కావచ్చేమో!

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?