Viral Video: కదిలివచ్చిన ‘నర్మదా మాతా.. ’నది మీద నడిచిన మహిళ.. దేవత అంటూ పూజలు.. చివరికి వీడిన మిస్టరీ..

|

Apr 11, 2023 | 12:23 PM

వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. దీంతో అనేక మంది దేవత అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జబల్‌పూర్ జిల్లాలో ఒక వృద్ధ మహిళ నర్మదా నది నీటిపై నడుస్తున్నట్లున్న ఓ వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. చాలా మంది ఆమెను  దేవతగా భావించారు.

Viral Video: కదిలివచ్చిన నర్మదా మాతా.. ’నది మీద నడిచిన మహిళ.. దేవత అంటూ పూజలు.. చివరికి వీడిన మిస్టరీ..
Woman Walking On Narmada River
Follow us on

మనిషి పంచ భూతాల మీద ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంటే.. గాలిలో తేలతాడని, నీటి మీద నడుస్తాడని అని చెబుతారు. అంతేకాదు  తన గురువు పిలుపు విన్న పద్మపాదుడు నదిమీద అలవోకగా నడుస్తూ.. గురువుని చేరుకున్నాడని పురాణాల కథనం. అయితే తాజాగా ఓ మహిళ పవిత్ర నర్మదా నీటి మీద నడించిందంటూ ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. దీంతో అనేక మంది దేవత అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జబల్‌పూర్ జిల్లాలో ఒక వృద్ధ మహిళ నర్మదా నది నీటిపై నడుస్తున్నట్లున్న ఓ వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. చాలా మంది ఆమెను  దేవతగా భావించారు. వివరాల్లోకి వెళ్తే..

“తిల్వారా ఘాట్ వద్ద నర్మదా నీటి ఉపరితలంపై నడుస్తున్న మహిళ” అనే క్యాప్షన్‌తో వీడియో వైరల్‌గా మారింది. వీడియో సోషల్ మీడియాలో వ్యాపించడంతో.. మహిళను చూసేందుకు స్థానికులు నది ఒడ్డుకు చేరుకున్నారు. . దీంతో ఆమె నర్మదా మాతా అంటూ ప్రజలు కీర్తించారు. ఆమె నదీ జలాల మీద నడుస్తున్నట్లు  కనిపించినప్పుడు.. ప్రజలు ఆమెను మా నర్మదా రూపంగా కొనియాడారు  జనం మాత్రం ఆమెను దైవాంశ సంభూతిరాలిగా కొలుస్తూ.. ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు క్యూ కట్టారు. మరికొందరైతే మానవహారంగా ఏర్పడి నర్మదా తీరం నుంచి ఆమెను స్థానికంగా ఓ ఇంటికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి :

అసలు నిజం ఏమిటంటే:

నదిలో నడుస్తూ వస్తున్న వృద్ధురాలికి స్వాగతం చెప్పడానికి ప్రజలు భారీగా హాజరయ్యారు. డప్పులు వాయిస్తూ ఆమె చుట్టూ గుమిగూడారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నర్మదా నది ఒడ్డుకు చేరుకుని విచారణ చేపట్టారు. తాను సామాన్యురాలిని అని, తనకు ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవని ఆ మహిళ చెబుతున్నారు.

అసలు ఆ మహిళ నర్మదా నదిపై నడిచిందా?

జ్యోతి రఘువంశీ అనే ఈ వృద్ధ మహిళ తాను నర్మదా నదీ జలాలపై నడవలేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తాను 10 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయానని .. ఇప్పుడు నర్మదాపురంలో నివాసం ఉంటున్నానని పోలీసులకు తెలిపింది.

వీడిన మిస్టరీ 

నర్మదా నది నీటి మట్టం ఎక్కువగా లేదని.. నదిలో కొన్ని చోట్ల నీటి మట్టం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ వీడియో తిల్వారా ఘాట్ వద్ద వీడియో చిత్రీకరించలేదని జ్యోతి కేవలం నది ఒడ్డున నడుస్తోందని పేర్కొన్నారు. జ్యోతి భక్తిగా నర్మదా నదికి ప్రదక్షిణలు చేసి.. తన ప్రయాణం మొదలు పెట్టిందని.. అలా ఆమె నది ఒడ్డున నడిచింది. నదిలో లోతు ఎక్కువ ఉన్న ప్రదేశంలోకి వెళ్ళలేదు. తక్కువ నీటి మట్టం ఉన్న ప్రాంతంలోనే నడిచినట్లు తెలుస్తోంది. పోలీసులు జ్యోతి కుటుంబీకులను సంప్రదించారు. ఇంటికి జ్యోతిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..