Viral Video: వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన మహిళ.. న్యాయం జరిగేదాకా దిగేదిలేదంటూ హల్‌చల్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో

|

Aug 03, 2022 | 10:03 AM

Uttar Pradesh: మున్సిపాలిటీ అధికారుల తీరుతో విసిగిపోయిన ఓ మహిళ వాటర్‌ ట్యాంకు ఎత్తి హల్‌చల్‌ చేసింది. దుకాణం బదిలీ కోసం అధికారులు లంచం అడుగుతున్నారంటూ తన సమస్య తీరేవరకు కిందకు దిగనంటూ మారాం చేసింది..

Viral Video: వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన మహిళ.. న్యాయం జరిగేదాకా దిగేదిలేదంటూ హల్‌చల్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో
Water Tank
Follow us on

Uttar Pradesh: మున్సిపాలిటీ అధికారుల తీరుతో విసిగిపోయిన ఓ మహిళ వాటర్‌ ట్యాంకు ఎత్తి హల్‌చల్‌ చేసింది. దుకాణం బదిలీ కోసం అధికారులు లంచం అడుగుతున్నారంటూ తన సమస్య తీరేవరకు కిందకు దిగనంటూ మారాం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన మహిళ చాలా సేపటి వరకు అక్కడే ఉండిపోయింది. దీంతో కలెక్టరేట్ ఆవరణలో గందరగోళ వాతావరణం నెలకొంది. హత్రాస్‌లోని రతన్‌కుంజ్ కాలనీ నివాసి సునీతా సింగ్, మున్సిపాలిటీలోని షాప్ నంబర్ 4 బదిలీకి సంబంధించి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు. షాపు బదిలీ కోసం కొందరు లంచం అడుగుతున్నారని బాధితురాలు వాపోయింది. మున్సిపాలిటీ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తో పాటు ఇతర ఉద్యోగులు తనను 50 వేలు లంచం డిమాండ్ చేశారని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ వినలేదని సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జిల్లా మెజిస్ట్రేట్‌కు తెలియజేశానని, అయినా న్యాయం జరగడం లేదని చెప్పుకొచ్చింది.

కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సంబంధిత అధికారులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చాలాసేపయ్యాక కానీ బాధితురాలు కిందకు దిగలేదు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి ఓవర్‌బ్రిడ్జిపై ఆందోళనకు దిగింది. దీంతో ఆ మార్గంలో వచ్చి పోయే వాహనాలకు ఆటంకం కలిగింది. చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో హత్రాస్ గేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..