Viral Video: సెల్ఫీ సాకుతో చంపాలనుకుంది… భార్యపై భర్త ఫిర్యాదు… అసలేం జరిగిందంటే…

కొత్తగా పెళ్లయిన జంట.. డ్యూయెట్‌ పాడుకుంటూ అలా షికారుకెళ్లింది. ప్రకృతి ఒడిలో చూసి పరవశిస్తూ సెల్ఫీలతో సేద తీరింది. అనుకోని సంఘటనతో షాక్‌కు గురయింది. అప్పటి వరకు చిలకా గొరింకల్లా కలిసి ఉన్న ఆ జంట ఒక్కసారిగా పాము ముంగీస లెక్క పోట్లాడుకోవడం మొదలు పెట్టింది. కృష్ణా నది బ్రిడ్జి మీద...

Viral Video: సెల్ఫీ సాకుతో చంపాలనుకుంది... భార్యపై భర్త ఫిర్యాదు... అసలేం జరిగిందంటే...
Wife Pushed Husband In The

Updated on: Jul 13, 2025 | 1:29 PM

కొత్తగా పెళ్లయిన జంట.. డ్యూయెట్‌ పాడుకుంటూ అలా షికారుకెళ్లింది. ప్రకృతి ఒడిలో చూసి పరవశిస్తూ సెల్ఫీలతో సేద తీరింది. అనుకోని సంఘటనతో షాక్‌కు గురయింది. అప్పటి వరకు చిలకా గొరింకల్లా కలిసి ఉన్న ఆ జంట ఒక్కసారిగా పాము ముంగీస లెక్క పోట్లాడుకోవడం మొదలు పెట్టింది. కృష్ణా నది బ్రిడ్జి మీద ఆ జంట పోట్లాడుకోవడం చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. కృష్ణా నది బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా సెల్ఫీ తీసుకుందామని ఆగారట. అంతలోనే భర్త నదిలో పడిపోయారు. వాహనదారుల సాయంతో బతుకుజీవుడా అంటూ ఒడ్డుకు చేరిన అతను చెప్పింది విని స్థానికులు షాక్‌ అయ్యారు. ఒడ్డుకు వచ్చిన భర్త ‘నా భార్యే నదిలోకి తోసేసింది’ అని చెప్పాడు. దీంతో ‘అదేం లేదు ఆయనే పడ్డాడు’ అని భార్య వాదనకు దిగింది. ఊహకందని ట్విస్ట్‌లతో కూడిన ఈ ఘటన రాయచూరు తాలూకా గుర్జాపూర్‌ వంతెన వద్ద జరిగింది.

కర్ణాటకలోని రాయచూరు జిల్లా శక్తినగర్‌కు చెందిన తాతప్పకు స్థానికురాలైన సుమంగళితో మూడు నెలల క్రితం పెళ్లైంది. పెళ్లయినప్పటి నుంచీ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం తాతప్ప తన భార్యతో కలిసి వడిగేరి గ్రామం నుంచి వెళ్తూ గుర్జాపూర్‌ బ్రిడ్జి మీద ఆగారు. సెల్ఫీ దిగుదామని సుమంగళి అడిగింది. దీంతో బ్రిడ్జి అంచున నిలబడి ఇద్దరూ కవర్‌ అయ్యేలా ఫొటో తీసుకునే క్రమంలో భర్త నదిలోకి పడిపోయారు. ఈత రావడంతో ప్రవాహాన్ని దాటుకొని ఓ బండపైకి చేరుకున్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు అతడిని గమనించి తాళ్ల సాయంతో బయటికి తీసుకొచ్చారు.

నదిలో నుంచి బ్రిడ్జిపైకి చేరుకున్న తాతప్ప ‘నువ్వే నన్ను తోసేశావు’ అని భార్యపై కోప్పడ్డాడు. ‘నేను తోయలేదు బ్యాలెన్స్‌ తప్పి నువ్వే పడిపోయావు’ అని ఆమె చెప్పుకొచ్చింది. కాసేపు ఇద్దరు ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వాళ్లను ఇంటికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘‘సెల్ఫీ కోసం ఆమె పట్టుబట్టడంతో నేను అంగీకరించాను. ఫొటో తీసుకుంటుండగా నన్ను హఠాత్తుగా నదిలోకి తోసేసి చంపడానికి ప్రయత్నించింది. ప్రవాహానికి కొట్టుకుపోయిన నేను నది మధ్యలో ఉన్న ఒక బండరాయిని పట్టుకున్నాను. స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాను”అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

వీడియో చూడండి: