Viral Video: ఎండలు మండిస్తున్నాయి. దీంతో ఎండవేడిమికి తాళలేక అనేక వన్యప్రాణులు దాహంతో చనిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతతో మనుషులు, జంతువులు, పక్షులు దాహార్తితో నీటి కోసం ఇంటింటికీ తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నోరు లేని ముగా జీవులకు సహాయం చేయడానికి దాహార్తిని తీర్చడానికి చాలా మంది ముందుకు వస్తారు. తాజాగా ఓ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి బాటిల్ తో కింగ్ కోబ్రాకు నీరు ఇవ్వడం కనిపిస్తుంది. పాములలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా.. ఇది కాటు వేస్తే బాధితుడు బతకడం దాదాపు అసాధ్యం.. అటువంటి భయంకరమైన విష సర్పానికి ఓ వ్యక్తి భయం లేకుండా బాటిల్ తో వాటర్ ఇవ్వడం కనిపిస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోలో.. పొడవాటి కింగ్ కోబ్రా నేలపై పాకుతుంది. దాహార్తితో తల్లడిల్లుతున్నట్లు ఓ వ్యక్తి గుర్తించాడు. దీంతో ఆ వ్యక్తి భయం లేకుండా పాముకి నీరు ఇస్తున్నాడు. నాగుపాము బాటిల్ లో నీరుని.. ఓ పసి బిడ్డలా ఆర్తిగా తాగుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. మనవత్వం, దయ అనే క్యాప్షన్ తో వీడియో షేర్ చేశారు, అంతేకాదు కాలం మారుతుందిని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను 58 వేల మందికి పైగా చూశారు. నాలుగు వేల మందికి పైగా క్లిప్‌ను లైక్ చేసారు.
అతని కరుణ.. అద్భుతం అని ఒకరు కామెంట్ చేయగా.. కింగ్ కోబ్రా నీటిని ఇష్టపడే సరీసృపాలు కనుక వీటిని చల్లగా ఉంచడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని.. భయం లేకుండా దాహం తీర్చిన ఆ వ్యక్తి మంచితనానికి వందనం చేస్తూ ఒక వినియోగదారు కామెంట్ చేశారు. ఇది చాలా ఆహ్లాదకరమైన దృశ్యం. దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం కూడా మంచిదే.. అంటూ రకరకాల కామెంట్స్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..