అడవి గురించి అడవిలో నివసించే జంతువుల గురించి బాగా తెలిసిన వ్యక్తులకు అడవిలో నివసించడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయని.. అడవిలోని ప్రతి జంతువు వాటికి కట్టుబడి ఉంటుందని .. వాటిని ఎల్లప్పుడూ అనుసరిస్తుందని తెలుస్తుంది. అయితే అడవి ప్రాంతానికి వెళితే.. ఈ నియమాలు , నిబంధనలు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. అయితే అడవిలో ఉన్న ఈ చట్టాలను, నియమ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఏమిటనేది వైరల్‌గా మారుతున్న ఈ వీడియోను చూస్తే ఎవరికైనా సులభంగా అర్ధం అవుతుంది.
భూమి మీద నివసించే అతి పెద్ద జంతువు ఏనుగు. ఇది చాలా ప్రశాంతమైన, తెలివైన, భావోద్వేగ జంతువు అని అందరికీ తెలుసు. అదే సమయంలో అసమానమైన శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఏనుగుకి కోపం వస్తే అంతే ప్రమాదకరం. ముఖ్యంగా ఏనుగుకు కోపం వచ్చినప్పుడు ఆకలి వేస్తే అప్పుడు జరిగే పరిణామాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ‘కింగ్ ఆఫ్ ది జంగిల్’ అడవి నుంచి బయటకు వచ్చి తనకు ఎదురుగా ఏదైనా తినదగినది కనిపిస్తే.. దానిని పూర్తిగా ఎగబడి తినేస్తుంది. తాజాగా శ్రీలంక లో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
This is what happens when elephants get used to being fed by humans in passing vehicles!! pic.twitter.com/t56QpEIA9y
— Evarts (@r_evarts) December 12, 2023
వైరల్ అవుతున్న వీడియో శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్‌కి చెందినది. ఆస్ట్రేలియన్ పర్యాటకులు వెళ్తున్న సమయంలో ఏనుగుకి ఆకలి వేసినట్లు ఉంది. కుటుంబ సభ్యులతో ఉన్న వ్యాన్ పార్కును దాటుతుంది. అప్పుడు దట్టమైన చెట్ల నుండి ఏనుగు బయటకు వచ్చి.. ఆ కారు మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి వారి ఆహారాన్ని దొంగిలించింది. ఏనుగు ఆకలితో వ్యాన్ లో ఉన్న ఆహారాన్ని తీసుకుని తినేసింది. ఆ వ్యాన్ లో ఉన్న వారికి ఏనుగుని చూసి భయపడినట్లు కనిపిస్తున్నారు.
అతను తన కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నాడు. ఈ వార్త రాసే సమయానికి 30 వేల మందికి పైగా చూశారు.. అనేక మంది రకరకాల కామెంట్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. నిజంగా ఈ దృశ్యం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది’ అని రాశారు. అంతేకాదు చాలా మంది వినియోగదారులు కూడా దీనిపై రకరకాలుగా వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..